మెహబూబా.... అప్పుడే సినిమా చూసి రివ్యూ కూడా చెప్పేసిన దిల్ రాజు!

By Bojja Kumar

Recommended Video

Dil Raju Review On Krishnarjuna Yudham

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. మే 11న సమ్మర్‌ స్పెషల్‌గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 1971 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూరి ఆకాశ్‌ సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

 చాలా హిట్స్ కొట్టాడు, అప్ అండ్ డౌన్స్ కామన్

చాలా హిట్స్ కొట్టాడు, అప్ అండ్ డౌన్స్ కామన్

పూరి జగన్ గారితో 2002లో ఇడియట్ సమయంలో అసోసియేట్ అయ్యాను. అపుడు నేను నథింగ్. పవన్ కళ్యాణ్ గారితో జగన్ ‘బద్రి', బన్నీతో ‘దేశ ముదురు' , మహేష్ బాబుతో ‘పోకిరి', చిరుత ద్వారా చరణ్‌ను ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రభాస్‌తో బుజ్జిగాడు, రవితేజతో ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి... ఇలా అందరు హీరోలతో వర్క్ చేశాడు. మొన్న ఎన్టీఆర్‌తో టెంపర్ చేశాడు. ఇలా అందరు టాప్ స్టార్లతో పని చేసి సక్సెస్ చూశాడు. అందరికీ ఒక క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేశారు. ఇదంతా గతం. అప్ అండ్ డౌన్స్ అనేది కామన్.... పూరి విషయంలో కూడా అదే జరిగింది అని... అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

కథ రాశాడా? లేదా? అనే డౌట్ ఉండేది

కథ రాశాడా? లేదా? అనే డౌట్ ఉండేది

నేనెప్పుడూ బిలీవ్ చేసేది ఒకటే. జగన్ ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్. ఆయన కథ రాస్తే సినిమా తీయడం ఇరగ్గొడతాడు. మెహబూబా టీజర్ రిలీజైనపుడే సంథింగ్ ఇంట్రెస్ట్ అనిపించింది. అయితే సినిమా చూడనిదే జడ్జ్ చేయలేను, సినిమా రెడీగా ఉంటే చూస్తాను అన్నాను. 15 రోజుల తర్వాత నా డేట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ షో వేశారు. నేను భయం భయంగానే వెళ్లాను. ఎందుకంటే తన కొడుకును లాంచ్ చేస్తూ సినిమా చూపిస్తున్నాడు. కథ రాస్తే సినిమా బాగా తీస్తాడు... కానీ కథ రాశాడా? లేదా? అనే డౌట్ ఉండేది... అని దిల్ రాజు అన్నారు.

ఫస్టాఫ్ బావుంది, కానీ సెకండా....

ఫస్టాఫ్ బావుంది, కానీ సెకండా....

ఫస్టాఫ్ చూసిన తర్వాత గుడ్ అని జగన్ తో చెప్పాను. మరి సెకండాఫ్ ఎలా తీశాడో అనే డౌట్.... సెకండాఫ్ కూడా మొదలైన తర్వాత ప్రీ క్లైమాక్స్ వచ్చినపుడు పవర్ పోయింది. పక్కన చార్మి పవర్ వచ్చే వరకు ఆగండి సౌండ్ బావుంటుంది అంటే... నాకు సినిమా ఎలా ఉంటుందో అర్థమైంది. ల్యాప్ టాప్‍‌లో మిగిలిన సినిమా చూపించండి చాలు అన్నాను. చూసి బయటకు వచ్చి జగన్‌ను హగ్ చేసుకుని ఇది నీ స్ట్రెంత్ అని చెప్పాను. ఒక డైరెక్టర్‌గా నువ్వు కథ రాసి సినిమా తీస్తే తప్పకుండా బావుంటుంది అని అతడితో చెప్పినట్లు దిల్ రాజు తెలిపారు.

 జగన్ మ్యాజిక్ మెహబూబాతో మళ్లీ రిపీట్ అయింది

జగన్ మ్యాజిక్ మెహబూబాతో మళ్లీ రిపీట్ అయింది

మెహబూబా సినిమా చూసిన తర్వాత కలిసినోడికి, తెలిసినోడికి అందరికీ చెబుతున్నాను సినిమా బావుందని, అది నా మొదటి రియాక్షన్. ఆడియన్స్ అందరూ నా స్టేట్మెంట్స్ చూస్తుంటారు. బాగోలేనపుడు నన్ను ఏకుతూ ఉంటారు దిల్ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడు సినిమా బాగోలేదేమిటి అని.... అదొక భయం. మనల్ని ఆడియన్స్ నమ్ముతున్నపుడు మన జడ్జిమెంట్ కరెక్టుగా ఉండాలని అలర్టుగా ఉంటాను. జగన్ మ్యాజిక్ మెహబూబాతో మళ్లీ రిపీట్ అయిందని నమ్మకంగా చెబుతున్నాను.... అని దిల్ రాజు తెలిపారు.

జగన్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ మెహబూబా అవుతుంది

జగన్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ మెహబూబా అవుతుంది

మగధీరలో 400 సంవత్సరాల క్రితం కథను తీసుకుని రాజమౌళి గారు అద్భుతంగా తీశారు. జగన్ 1971 ఇండియా-పాకిస్థాన్ వార్.... మరియు ఇప్పటి నేపథ్యాన్ని తీసుకుని రెండు స్టోరీలను కలిపి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఇద్దరు ఆర్టిస్టులతో.... నేను వారి ఆర్టిస్టులే అంటాను ఎందుకంటే వారు ఇంకా హీరో హీరోయిన్ కాలేదు....వారి నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకుని లవ్ ఎమోషన్ స్క్రీన్ ప్లేలో అద్భుతంగా చూపించారు. ఒక కొత్త సినిమా చూసినట్లు అనిపించింది. చాలా లవ్ స్టోరీలు చూశాం. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ తీసుకున్న విధానం, అందులో కథను మౌల్డ్ చేసిన విధానం బావుంది. ఆకాష్, నేహా సూపర్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. జగన్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ మెహబూబా అవుతుంది. ఇది నా సేట్టెంట్... మే 11న ప్రేక్షకుల నుండి వచ్చే రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.... అని దిల్ రాజు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X