ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ కథలు ఏ రేంజ్ లో పుట్టుకొస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నేటితరం హీరోలు చాలా వరకు కుదిరితే పాన్ ఇండియా లేకపోతే మల్టీస్టారర్ సినిమాలు అంటున్నారు. కథ బావుంటే ఏ మాత్రం నో చెప్పడం లేదు. చాలా రోజులుగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కాంబోపై కూడా కథనాలు వస్తున్నాయి. అయితే ఇదివరకే ఆ కథ ఓ ఇద్దరి హీరోల చుట్టూ తిరిగిందట.

స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు

స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక త్వరలో వీరిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

ఆ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న దర్శకుడు

ఆ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న దర్శకుడు

ఇక ఈ దిగ్గజ హీరోలను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు మహి వి రాఘవ అని తెలుస్తోంది. ఇదివరకు ఈ దర్శకుడు తాప్సితో ఆనందో బ్రహ్మ అనే సినిమా చేశాడు. అలాగే వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా యాత్ర అనే సినిమా కూడా చేశాడు. రెండు సినిమాలు కూడా దర్శకుడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

రిజెక్ట్ చేయడంతో..

రిజెక్ట్ చేయడంతో..

అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఈ మల్టీస్టారర్ కథను ఇదివరకే దర్శకుడు మహి వి రాఘవ ఇతర హీరోలకు చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు రిజెక్ట్ చేయడంతో ఎప్పటికప్పుడు మార్పులు బాగానే చేసుకుంటూ వెళ్లాడట. ఇక ఓ ఇద్దరు హీరోలు కాస్త పాజిటివ్ గా స్పందించడంతో 2019లోనే మల్టీస్టారర్ కు సంబంధించిన రూమర్స్ బాగానే వచ్చాయి.

ముందుగా ఆ ఇద్దరు హీరోలు

ముందుగా ఆ ఇద్దరు హీరోలు

ఇక ఆ హీరోలు మరెవరో కాదు. నాని, విశాల్. గత ఏడాది వరకు కూడా దర్శకుడు వాళ్లనే హీరోలుగా సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఇద్దరు హీరోలు కథలపై కాస్త చెంజెస్ అడగడంతో దర్శకుడి ఆలోచన కూడా మారింది. ఇక ఆ కథను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తే బావుంటుందని ఫిక్స్ అయ్యాడట.

Recommended Video

'1992' Movie CHELIYA CHELIYA Lyrical Video Launched By Raj Kandukuri
 మరోసారి సిట్టింగ్..

మరోసారి సిట్టింగ్..

బడ్జెట్ కూడా ఎక్కువవ్వడంతో స్టార్ హీరోలను సెలెక్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ గురించి విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లకు చెప్పాడట. వాళ్ళు పాజిటివ్ గానే స్పందించినట్లు తెలుస్తోంది. దర్శకుడు మరిన్ని మార్పులు చేయాలని మళ్ళీ కొంతమంది రైటర్స్ తో సిట్టింగ్ వేసినట్లు సమాచారం. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత మరోసారి హీరోలకు వినిపించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X