»   »  డ్రగ్స్ కేసు: దర్శకుడు పూరీ కూతురు వార్నింగ్!

డ్రగ్స్ కేసు: దర్శకుడు పూరీ కూతురు వార్నింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో డ్రగ్స్ కేసు సృష్టించిన ప్రకంపనలు ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. ఈ కేసులో సంబంధం ఉన్న వారితో పాటు ఎలాంటి సంబంధం లేని వారి పేర్లు కూడా బయటకు వస్తుండటం, మీడియాలో ఈ విషయమై బాగా ప్రచారం జరుగుతుండటంతో ఆయా స్టార్ల కుటుంబ సభ్యులు ఆందోళనలో పడిపోయారు.

టాప్ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేరు కూడా ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. పూరి డ్రగ్స్ తీసుకున్నారని, ఆయనకు నోటీసులు అందాయని, ఆయన ద్వారా ఇంకొందరు స్టార్స్ కూడా డ్రగ్స్ అలవాటయిందంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పూరి కూతురు పవిత్ర స్పందించారు.


నా తండ్రి అలాంటివాడు కాదు

నా తండ్రి అలాంటివాడు కాదు

డ్రగ్స్ కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు అలాంటి అలవాట్లు లేదని పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర అన్నారు. మీడియాలో తన తండ్రి గురించి వస్తున్న వార్తలు విని షాకైనట్లు తెలిపారు.తమ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం

తమ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం

తన తండ్రి సినీ ప్రముఖుడు కావడం వల్లనే ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని, నిజానిజాలు తెలుసుకోకుండా తమపై అనవసరంగా నిందలు వేయవద్దని, ఇది తమ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయమని పవిత్ర తెలిపారు.అదుపులో ఉండాలని వార్నింగ్

అదుపులో ఉండాలని వార్నింగ్

తన తండ్రి ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు, ఉన్నత లక్ష్యాలతో కూడిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. పనిపాట లేని వాళ్లే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని.... తన తండ్రి గురించి మాట్లాడేపుడు కాస్త అదుపులో ఉండాలని, ఎలా పడితే అలా మాట్లాడితే సహించేది లేదని పవిత్ర వార్నింగ్ ఇచ్చారు.పూరి స్పందన

డ్రగ్ కేసు వ్యవహారంలో మీడియాలో తన పేరు వస్తుండటంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై తాను ఇప్పటివరకు స్పందించలేదని, పైసా వసూల్ షూటింగులో బిజీగా ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు.English summary
Director Puri Jagannadh daughter Pavitra says, "MY DAD IS NOT INVOLVED IN DRUGS" . She's blaming those jobless people who are writing badly about her father.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu