పూరి జగన్నాధ్ మీద పవన్ ఫ్యాన్ వీరంగం... రంగంలోకి డైరెక్టర్ ఫ్యాన్స్!

By Bojja Kumar

Recommended Video

Puri Jagannadh Fans Strongly Replies To Pawan Kalyan Fans

ఈ మధ్య యూట్యూబ్, సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకునే ఓ వ్యక్తి పూరి మీద దారుణమైన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ నీకు తొలి సినిమా అవకాశం ఇవ్వడం వల్లనే నువ్వు ఈ స్థాయికి వచ్చావు. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ఏం చేశావ్? ప్రజల కోసం రాజకీయ పార్టీ పెడితే నువ్వు కనీసం ఆయనకు మద్దతు కూడా ఇవ్వడం లేదు అంటూ ఆరోపణలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పూరి జగన్నాథ్ అభిమానులు రంగంలోకి దిగారు. పూరి మీద కామెంట్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఏ రోజూ తక్కువ చేయలేదు, గొప్పగా చెప్పాడు

ఏ రోజూ తక్కువ చేయలేదు, గొప్పగా చెప్పాడు

పూరి వద్ద అసిస్టెంటుగా పని చేసిన ఓ వ్యక్తి... పవన్ కళ్యాణ్ అభిమానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూరి గారి గురించి నీకేం తెలుసు? పవన్ కళ్యాణ్ గారు మొదటి అవకాశం ఇచ్చిన విషయాన్ని ఫ్యాన్స్ మరిచిపోయినా పూరి మరిచిపోలేదు. చాలా ఆడియో ఫంక్షన్స్‌లో ఆయన గురించి గొప్పగా చెప్పాడు. ఏ రోజూ తక్కువ చేసి మాట్లాడలేదు. నీకన్నా, నా కన్నా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పూరికి మాత్రమే ఉంది... అని తెలిపారు.

ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడానికే ఇదంతా చేస్తున్నావా?

ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడానికే ఇదంతా చేస్తున్నావా?

ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. మీ లాంటి వారి వల్ల పవన్ కళ్యాన్‌కు చెడ్డ పేరు వస్తోంది. కొన్ని సార్లు మీ మూలంగా ఆయనపై నెగెటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతోంది అని ఫైర్ అయ్యారు.

 ఆర్జీవీ భజన చేస్తున్నాడనేది నిజం కాదు

ఆర్జీవీ భజన చేస్తున్నాడనేది నిజం కాదు

పూరి ఎప్పుడూ ఆర్జీవి భజన చేస్తున్నాడని మీరు ఆరోపిస్తున్నారు... కానీ ఆ మధ్య పవన్ కళ్యాణ్-ఆర్జీవి ఇష్యూ జరిగినపుడు పవన్ కళ్యాణ్‌కు సపోర్టుగా ట్వీట్ చేసినపుడు మీ కళ్లు ఎక్కడికి వెళ్లాయి? ‘నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ బాధపడటం నాకూ బాధ కలిగించింది. ఆర్జీవి చేసిన పని నాకు నచ్చలేదు. ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా ఉంటాను' అని పూరి చెప్పిన విషయాన్ని మీరు మరిచిపోవద్దు... అని అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు

రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు

ఇలాంటి వీడియోలు చేయడం వల్ల అభిమానుల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నమే తప్ప... మరో ఉద్దేశ్యం కనిపించడం లేదు. ఇవి ఇప్పటికైనా ఆపితే మంచిది అని పూరి అభిమానులు ఫైర్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X