సిట్ అధికారుల ముందుకు పూరీ.. సినీ ఫక్కీలో సంధించే తికమక ప్రశ్నలివేనట..

ఈ కేసులో పూరీ కీలకంగా మారడంతో పూరిని సిట్‌ అధికారులు అడిగే అవకాశమున్న ప్రశ్నలు ఇవే అనే మాట వినిపిస్తున్నది. ఈ ప్రశ్నావళి పలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలు అధికారులు రూపొందించారా? లేక మర

By Rajababu

రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసుకు సంబంధించి టాలీవుడ్ ప్రముఖుల్ని సిట్ అధికారులు బుధవారం (19వ తేదీ నుంచి) విచారణ ప్రారంభించనున్నారు. తొలిరోజు విచారణకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయనకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏ కోణంలో సినీ ప్రముఖులను విచారిస్తారు. వారిని ఏమేమీ ప్రశ్నలు అడుగుతారనేది పోలీసు, సినీ, సాధారణ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

Director puri jagannath may attend before SIT probe

ఈ కేసుకు సంబంధించిన ఒకే రకమైన ప్రశ్నావళి అధికారులు రూపొందించారని, వాటినే అందర్ని అడిగే వారిచ్చే జవాబులను బట్టి వారి పాత్రను, కేసును విశ్లేషిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ కేసులో పూరీ కీలకంగా మారడంతో పూరిని సిట్‌ అధికారులు అడిగే అవకాశమున్న ప్రశ్నలు ఇవే అనే మాట వినిపిస్తున్నది. ఈ ప్రశ్నావళి పలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలు అధికారులు రూపొందించారా? లేక మరొకరు క్రైమ్ బీట్ చూసే రిపోర్టర్లు తమ స్వంత ఆసక్తితో రూపొందించారా అనే పశ్న ఉత్పన్నమవుతున్నది.

Recommended Video

Daggubati Sureshbabu Reacted On Tollywood Drug Issue
డ్రగ సప్లయర్ కెల్విన్‌ ఎలా పరిచయం?

డ్రగ సప్లయర్ కెల్విన్‌ ఎలా పరిచయం?

ఈ కేసులో డ్రగ్ సప్లయర్ కెల్విన్ అరెస్ట్ ద్వారానే ఈ కేసు గుట్టు రట్టయింది. ఆయన ఫోన్ కాల్ ఆధారంగానే పలువురు సినీ ప్రముఖుల జాతకాలు బట్టబయలు అయ్యాయి. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులకు కెల్విన్‌తో జరిగి పరిచయం, ఆయన ఎవరు పరిచయం చేశారనే ప్రశ్నలను ఈ కేసులో గుప్పించే అవకాశం ఉంది.

ఇంట్లోనే ఎందుకు చేసుకుంటారు?

ఇంట్లోనే ఎందుకు చేసుకుంటారు?

సాధారణంగా స్నేహితులందరూ కలిసి మందు పార్టీలు బయటనే చేసుకొంటారు. కానీ డ్రగ్ కేసులో చాలా వరకు పార్టీలు ఎక్కువగా కొందరి ఇంట్లోనే జరిగాయనేది అధికారులు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వారు ఫలానా వాళ్ల ఇంట్లోనే ఎందుకు చేసుకొన్నారనే కోణంలో ఆరోపణలు ఎదుర్కొనే వారిని అడుగవచ్చు.

కెల్విన్‌, జిషన్‌లు ఇంటికి ఎందుకు వచ్చారు?

కెల్విన్‌, జిషన్‌లు ఇంటికి ఎందుకు వచ్చారు?

అత్యంత సన్నిహితుల మధ్య జరిగే పార్టీలకు కెల్విన్, అతని అనుచరులు ఎందుకు వచ్చారు. వారికి పార్టీకి సంబంధమేమిటీ? డ్రగ్ సరఫరాదారులైన వారు వాటిని సప్లయ్ చేసేందుకే వచ్చారా అనే ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది.

ఎన్ని రోజులుగా డ్రగ్స్‌ వాడుతున్నారు?

ఎన్ని రోజులుగా డ్రగ్స్‌ వాడుతున్నారు?

సినీ ప్రముఖులు డ్రగ్ వినియోగం దాదాపుగా నిర్ధారణ అయిన నేపథ్యంలో వాటిని ఎన్ని రోజుల నుంచి వినియోగిస్తున్నారు. వాటి రకాలు ఏమిటి? వాటిని ఎవరు అందజేశారు. ఎక్కడ నుంచి వచ్చాయి అనే ప్రశ్నలు సహజంగా సంధించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రశ్నలకు సినీ ప్రముఖులు ఎలాంటి జవాబులిస్తారో వేచి చూడాల్సిందే.

డ్రగ్స్ కెల్విన్‌ దగ్గర ఉన్నట్టు ఎవరి ద్వారా తెలిసింది?

డ్రగ్స్ కెల్విన్‌ దగ్గర ఉన్నట్టు ఎవరి ద్వారా తెలిసింది?

కెల్విన్ ఫోన్ కాల్ డాటా ఆధారంగా అతనితో సంబంధమున్న వ్యక్తులను తీవ్రంగా విచారించే అవకాశం ఉంది. కెల్విన్ డ్రగ్స్ సప్లయి చేస్తున్నట్టు ఎవరు చెప్పారు. ఎవరి వద్ద నుంచి ఈ సమాచారం అందింది. వారికి ఏ విధమైన సంబంధాలున్నాయి. డ్రగ్ సప్లయిలో వారి పాత్ర ఏంటి అనే ప్రశ్నలు వేయడానికి అధికారులు సిద్ధంగా ఉంటారు.

డ్రగ్స్‌ ఎన్ని రోజులకు ఓ సారి తీసుకొంటారు?

డ్రగ్స్‌ ఎన్ని రోజులకు ఓ సారి తీసుకొంటారు?

డ్రగ్స్ వాడకం ఎప్పుడు ఉంటుంది. ఎన్ని రోజులకోసారి తీసుకొంటారు. వాటిని ఎలా రవాణా చేస్తారు. తమ వద్ద ఉంటే ఎక్కడ భద్రపరుస్తారు. కెల్విన్ ఎలా వాటిని సరఫరా చేస్తాడు అనే కోణంలో సినీ ప్రముఖులను వివిధ రకాలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగి నిందితులను తికమకకు గురిచేసే అవకాశం ఉంది.

డ్రగ్స్‌ ఎవరు సరఫరా చేసేవారు?

డ్రగ్స్‌ ఎవరు సరఫరా చేసేవారు?

డ్రగ్స్ వినియోగం కెల్విన్‌ ద్వారానే అలవాటు చేసుకొన్నారా? లేక అంతకుముందే మరొకరి ద్వారా వినియోగించారా అనే ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. కెల్విన్ కాకుండా మరోకరు ఉంటే ఈ కేసు కొత్త మలుపు తిరిగే ఛాన్సులు ఉంటాయంటున్నారు.

ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవి తేజ, సుబ్బరాజులకు..

ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవి తేజ, సుబ్బరాజులకు..

డ్రగ్స్ వ్యవహారంలో పూరీ జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. పూరీ అండ్ కంపెనీ సభ్యుల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవితేజ, సుబ్బరాజు, తదితరలకు మీ నుంచే డ్రగ్స్‌, కొకైన్‌ వెళ్లింది నిజమా, కాదా? అనే పశ్నను అధికారులు వేసే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో ఎందుకు ఉండరు?

హైదరాబాద్‌లో ఎందుకు ఉండరు?

డ్రగ్స్ వాడకం తర్వాత చాలా మంది హైదరాబాద్‌ను విడిచి వెళ్తారనే ఆసక్తికరమైన సమాచారం అధికారులకు తెలిసింది. అయితే హైదరాబాద్‌ను విడిచి ఎందుకు వెళ్తారు అనే ప్రశ్నను అధికారులు అడిగి తెలుసుకొనే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు, కాల్ డాటా ఆధారాలను వారి ముందు పెట్టి నిజాలు రాబట్టే అవకాశం ఉంది.

బ్లడ్‌టెస్ట్‌కు సిద్ధమా?

బ్లడ్‌టెస్ట్‌కు సిద్ధమా?

సిట్ అధికారులు విచారణలో డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని మొండికేసినట్టయితే బ్లడ్ టెస్ట్ జరిపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మొండికేస్తే వారిని బ్లడ్ టెస్ట్‌కు సిద్ధమా అని అడిగే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పక్కా ప్రశ్నలతో అధికారులు సినీ ఫక్కీలో సినిమా ప్రముఖులకు తికమకకు గురిచేసే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X