twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీకు చేతులు జోడిస్తున్నా.. నిర్మాతలకు శాపంలా.. పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు!

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతల కష్టాలపై సెన్సేషనల్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆందోళన వ్యక్తం చేయడంపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు టి ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి జరిగిన సమావేశంలో పూరి జగన్నాథ్ నిర్మాతలు కష్టాల గురించి మాట్లాడిన విషయాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ సమావేశంలో ఇటీవల తన యూట్యూబ్‌లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..

     రివ్యూలతో ప్రమాదంలో నిర్మాతలు

    రివ్యూలతో ప్రమాదంలో నిర్మాతలు


    తెలుగు సినిమాలపై సినీ జర్నలిస్టులు వెల్లడించే రివ్యూలు, రేటింగ్స్ సినిమా ప్రదర్శనలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఆ వారి సమీక్షలు నిర్మాతలను ప్రమాదంలో పడేస్తున్నాయి. రివ్యూల కారణంగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు పారిపోయేలాగా చేస్తున్నాయి. ప్రతీ ఏడాది సగటున 200 చిత్రాలు నిర్మిస్తే. అందులో 190 చిత్రాలు ప్లాప్‌లుగా మారుతున్నాయి. కొందరు సినీ విశ్లేషకులు అవగాహనా రాహిత్యంతో వెల్లడించే సమీక్షలు సినిమాకు శాపంగా మారుతున్నాయంటూ పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

    ప్రతీ ఏడాది 190 ప్లాపులతో

    ప్రతీ ఏడాది 190 ప్లాపులతో

    ప్రతీ ఏడాది సినీ పరిశ్రమ 190 ప్లాపులతో ముందుకెళ్తున్నది. ఆర్టిస్ట్స్, డైరెక్టర్, టెక్నీషియన్స్‌కు పారితోషికం, లొకేషన్స్, టాక్స్ చెల్లించడం కోసం నిర్మాత భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తాడు. కొందరు జర్నలిస్టులు చేసే ప్రతికూల ట్వీట్లతో దర్శకులకు రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకొని నెగటివ్ రిపోర్టులు రాసేవారికి పూరీ జగన్నాథ్ చేతులు జోడించి అభ్యర్థించారు.

    రేటింగ్ విషయంలో ఆచీతూచీ

    రేటింగ్ విషయంలో ఆచీతూచీ

    ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రేటింగ్స్ విషయంలో సానుకూల దృక్పథం ఉండాలి. రేటింగ్ విషయంలో ఒక పాయింట్‌కు బదులుగా రెండు, రెండు బదులుగా మూడు రేటింగ్ ఇవ్వవచ్చు. దాంతో నిర్మాతలకు అండగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో సినీ విమర్శకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో సంయమనం చూపించాలనే విధంగా పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

    పరిశ్రమ బాగోగుల బాధ్యత

    పరిశ్రమ బాగోగుల బాధ్యత

    ఇలాంటి పరిస్తితుల్లో చాలా మంది సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారు. కేవలం సినిమా పట్ల మక్కువ ఉన్న నిర్మాతలు మాత్రమే వాటిని నిర్మిస్తున్నారు. ఏదైనా సినిమా వల్ల నిర్మాత నష్టపోతే అతడికి అండగా ఉండే ప్రయత్నం చేయాలి. సినీ పరిశ్రమ బాగోగులను పట్టించుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంది. వారు నిర్మాతలను కాపాడాలి అని దర్శకనిర్మాత పూరి జగన్నాధ్ నొక్కి చెప్పారు.

    Recommended Video

    Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
    సినీ జర్నలిస్టులకు అభ్యర్థన

    సినీ జర్నలిస్టులకు అభ్యర్థన

    సినీ పరిశ్రమ, నిర్మాతల స్థితిగతుల గురించి డైరెక్టర్, నిర్మాత పూరి జగన్నాథ్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాం. సినీ జర్నలిస్టులు, అన్ని రకాల మీడియా సంస్థలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోని వారి పూర్తి సహకారాన్ని అందించాలి అని మండలి గౌరవ కార్యదర్శులు టి ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల అభ్యర్థించారు.

    English summary
    Director puri jagannadh sensational comments on Review and Reviewers. Some of the journalists are giving rating, writing review without any concern makes producer unhappy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X