హీరోల ఫ్యాన్స్ హీరోయిన్లతో అసభ్యంగా.. చెండాలంగా.. పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు ట్రెండ్ సెట్ చేసే దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. డిఫరెంట్ స్టైల్ సినిమాలతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. గతంలో మాదిరిగా ఇప్పుడు విజయాలను దక్కించుకోవడం లేదు.
ఈ పరిస్థితుల్లో గతంలో 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్‌ను అందుకోగా.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'డబుల్ ఇస్మార్ట్' మూవీని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా పూరీ జగన్నాథ్.. పబ్లిక్ ప్లేస్‌లలో హీరోలు, హీరోయిన్లు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడాడు. ఆ వివరాలు మీకోసమే!

డబుల్ ఇస్మార్ట్‌తో బిజీగా: ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'డబుల్ ఇస్మార్ట్'ను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం ఇస్తున్నారు.
షూట్ లేట్.. వాయిదానే: పూరీ జగన్నాథ్ ప్రస్తుతం 'డబుల్ ఇస్మార్ట్' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మార్చి నెలలోనే విడుదల చేస్తున్నట్లు మొదట ప్రకటించారు. కానీ, అనివార్య కారణాలతో షూటింగ్ చాలా ఆలస్యం అవుతోంది. ఫలితంగా ఈ చిత్రాన్ని జూన్ లేదా జూలైలో విడుదల చేయాలని చూస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఫ్యాన్స్ ప్రవర్తనపై అలా: కొద్ది రోజుల క్రితమే పూరీ జగన్నాథ్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో జరిగిన ఎన్నో ఒడిదుడుకులకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో పబ్లిక్‌లో హీరో, హీరోయిన్ల పట్ల ఫ్యాన్స్ ప్రవర్తనపై సంచలన విషయాలను బయట పెట్టారు. దీంతో ఈ కామెంట్లు ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నాయి.
హీరోయిన్స్‌తో అసభ్యం: ఈ ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. 'ఈ మధ్య కాలంలోనే కాదు.. చాలా రోజుల నుంచే పబ్లిక్‌లో సినిమా వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది కావాలని హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఉద్దేశపూర్వకంగానే తాకుతూ ఇబ్బంది పెడుతుంటారు. అందుకే హీరోయిన్లు బయటకు రావడానికి భయపడిపోతుంటారు' అని చెప్పుకొచ్చాడు.

హీరోలవి పిసుకుతారు: పూరీ జగన్నాథ్ కొనసాగిస్తూ.. 'ఎవరికీ తెలియని విషయం చెప్తాను. హీరోయిన్లను లాగేస్తారు.. నొక్కేస్తారు.. బట్టలు చింపేస్తారు.. ఇవన్నీ చేస్తారని మీకు తెలుసు. హీరోలు బయటకెళ్లినా అలాగే చేస్తారని మీకు తెలుసా? హీరోల బాల్స్ పట్టుకుని నొక్కేస్తారు. అది కూడా మగవాళ్లే. ప్రతీ హీరోకు ఇలాంటి అనుభవం ఎదురైంది. కానీ, ఎవరూ బయటకు చెప్పలేదు' అని వివరించాడు.
అంత శాడిస్టులు వాళ్లు: ఇదే ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. 'హీరోలు బయటకెళ్లినప్పుడు ఎదురుగా ఎవరైనా కుర్రాళ్లు వస్తే.. వీళ్లేం చేస్తారోనని భయపడతారు. అంత శాడిస్ట్ నాకొడుకులు ఉన్నారు. హీరోల వాచ్‌లు ఎత్తుకెళ్లిపోతారు. వాళ్ల చేతిలో ఫోన్ ఉంటే లాక్కెల్లిపోతారు. చేతికున్నవి తెంపేస్తుంటారు. మెడలో ఉన్న చైన్లు లాగేస్తుంటారు' అని షాకింగ్ విషయాలను వెల్లడించాడు.


Click it and Unblock the Notifications











