లావణ్యను అలా చూసి షాకయ్యా.. అప్పుడే వదిలేద్దాం అనుకున్నా: భార్యపై పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు దర్శకులు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే డిఫరెంట్ స్టైల్ సినిమాలతో సెన్సేషన్ అయిపోయారు. అలాంటి వారిలో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన ఈ స్టార్ డైరెక్టర్.. మధ్యలో ఇబ్బందులు పడ్డాడు. కానీ, 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్‌ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'డబుల్ ఇస్మార్ట్' మూవీని చేస్తున్నాడు. ఇది త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా పూరీ జగన్నాథ్.. తన భార్య లావణ్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసమే!

డబుల్ ఇస్మార్ట్‌తో రెడీగా
ఉస్తాద్ రామ్‌ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా బిగ్ సక్సెస్ అవడంతో దీనికి సీక్వెల్‌గా 'డబుల్ ఇస్మార్ట్'‌ను రూపొందిస్తున్నాడు. ఈ మూవీని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. ఇది ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Director Puri Jagannadh Sensational Comments On Wife Lavanya Jagannadh

లవ్, పెళ్లిపై పూరీ ఓపెన్

పూరీ జగన్నాథ్ కొద్ది రోజుల క్రితమే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో జరిగిన ఎన్నో ఒడిదుడుకులకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో లావణ్యతో లవ్ ఎలా మొదలైంది? తర్వాత ఇద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు? వివాహం తర్వాత వాళ్ల లైఫ్ ఎలా సాగుతోంది? అనేవి వెల్లడించారు.

షూటింగ్‌కు వచ్చి లవ్
పూరీ జగన్నాథ్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'లావణ్యను ముందుగా ఓ షూటింగ్‌లో చూశాను. అప్పుడు నేను ఒక యాడ్‌ను షూట్ చేస్తున్నా. అప్పుడు అది చూడడానికి ఆమె వచ్చింది. అలా తనను ఒక గంట పాటు అలాగే చూశాను. తను మాత్రం నన్ను కాకుండా షూటింగ్‌నే చూస్తుంది. తర్వాత నా అసిస్టెంట్‌తో నా విజిటింగ్ కార్డును పంపించాను' అని చెప్పుకొచ్చారు.

పెళ్లి చేసుకుందామని

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొనసాగిస్తూ.. 'నా విజిటింగ్ కార్డ్ తీసుకున్న తర్వాత లావణ్య నాతో మాట్లాడేందుకు వచ్చింది. అప్పుడు ఆమెను నేరుగా పెళ్లి చేసుకుందామా అని అడిగాను. దీంతో ఆమె కూడా ఓకే అని చెప్పింది. అంతేకాదు, అప్పుడప్పుడూ కలుద్దాం అని అడిగింది. కానీ, అప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆమెను కలవాలంటే భయపడేవాడిని' అని వివరించాడు.

Director Puri Jagannadh Sensational Comments On Wife Lavanya Jagannadh

అది చూసి షాకయ్యా
దర్శకుడు పూరీ జగన్నాథ్ కంటిన్యూ చేస్తూ.. 'ఒకసారి లావణ్య ఓ రెస్టారెంట్‌కు వెళ్దాం అని అడిగింది. అప్పుడు తను ఒక ఫుల్ తందూరి చికెన్ ఆర్డర్ ఇచ్చింది. నేను మాత్రం అది తినడానికి ఆలోచిస్తుంటే ఆమె మాత్రం మొత్తం తినేసింది. అది చూసి షాకయ్యాను. వెంటనే ఆమెను వదిలేద్దాం అనుకున్నా. కానీ, తనకు అలా చెప్పలేకపోయాను' అంటూ వెల్లడించాడు.

దొంగ పెళ్లి చేసుకున్నా

పూరీ జగన్నాథ్ చివర్లో 'నేను 'నిన్నే పెళ్లాడతా' షూటింగ్‌లో ఉన్నాను. ఆ బ్రేక్ సమయంలోనే లావణ్యతో ఫ్రెండ్ అందరూ కలిసి పెళ్లి చేశారు. వాస్తవానికి అంతకు ముందే నేను మా రెండు ఫ్యామిలీలకు పెళ్లి గురించి చెప్పి ఒప్పించాను. కానీ, ఖర్చు పెట్టకూడదన్న ఉద్దేశంతోనే దొంగతనంగా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత తనలో లైఫ్ చాలా బాగుంది' అని ముగించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X