నా భార్య అలాంటిది.. ఆ విషయం తెలిశాక వదిలేద్దామనుకున్నా.. :పూరీ జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక ఆయన ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ తన భార్య లావణ్య గురించి చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. లావణ్య గురించి ఆ విషయం తెలిశాక వదిలేద్దామనుకున్నట్లు వెల్లడించారు. అసలు లావణ్య ఏం చేసింది.. ఎందుకు అలా అనాల్సి వచ్చిందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

షూటింగ్ సమయంలో...:ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరీ జగన్నాథ్ తన మ్యారేజ్ లైఫ్ గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. మీ సినిమాల్లోలాగానే మీ పెళ్లి కూడా మూడు పాటలు, మూడు ఫైట్లా అని ఇంటర్వ్యూలో అడగ్గా.. అట్లా ఏమిలేదు లేండి. నేను సినిమా తీసేప్పుడు షూటింగ్ చూడటానికి వచ్చింది. అప్పుడు ఆ సమయంలో చూసి బాగా నచ్చి.. రెండు గంటల సేపు తననే చూశాను. నాకు పెళ్లాంగా సరిపోతుందని ఫీల్ అయ్యాను. తను నన్ను చూడటం లేదు.. షూటింగ్ చూస్తుందని చెప్పుకువచ్చాడు.

Director Puri Jagannadh Shocking Comments on His Wife Lavanya News Goes Viral

గోస్ట్ డైరెక్టర్ గా...:''అసలు అక్కడ నేను గోస్ట్ డైెరెక్టర్ గా చేస్తున్నా.. ఎవరిదో సినిమా నాకు వెయ్యి రూపాయలు ఇస్తారంటే చేస్తున్నా... అప్పుడు తన దగ్గరకు వెళ్లాను. నా వద్ద విసిటింగ్ కార్డు ఒకటి ఉండేది. అది ఇచ్చి...నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఫోన్ చేయ్.. లేకపోతే వద్దు అని చెప్పి ఇచ్చివచ్చాను. తర్వాత ఓ వన్ వీక్ తర్వాత కాల్ చేసింది. ఎంత మందికి ఇచ్చావ్.. నీకు ఇదే అలవాటా.. ఎంత మందికి ఇచ్చావ్.. అంటూ క్వశ్చన్స్ చేసింద''ని వెల్లడించారు.

అలా తినేసరికి షాక్...:''ఇక అప్పుడప్పుడు కలువడం.. భోజనానికి వెళ్లడం.. ఇలా జరిగేది. అయితే అప్పుడు నాకు స్ట్రగులింగ్ టైం.. ఆ అమ్మాయి వస్తుందంటే.. ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకునేవాడిని. ఒకసారి ఏదో హోటల్ కు వెళ్లాం. అసలే నా దగ్గర టైట్ గా ఉన్నాయి. ఓ మంచి మీడియం హోటల్ కి వెళ్లాం. కూర్చున్నాక ఆర్డర్.. తందూరు కోడి చెప్పింది. నేను లైఫ్ లో ఎప్పుడూ కోడి తినలేదు. ఐస్ క్రీమ్స్ కూడా తినేవాడిని కాదు. నేను కొద్దిగా తింటున్నట్లు యాక్ట్ చేస్తున్నా... తను మాత్రం మొత్తం కోడిని తీనేసింది. అది చూసి షాక్ అయ్యాన''ని పూరీ తెలిపారు..

Director Puri Jagannadh Shocking Comments on His Wife Lavanya News Goes Viral

వదిలేద్దాం అనుకున్నా...:''ఇక నేను బయటకు వచ్చి పెళ్లే మానేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ పిల్లను నేను పెంచలేను అని అనుకున్నాను.. వీళ్ల నాన్న కోళ్లు పెట్టి బాగా పెంచాడు అని ఫీల్ అయ్యాను. ఇక తర్వాత తనకు చెప్పాను.. ఇక నో మోర్ మీటింగ్స్.. పెళ్లైతే చెప్పు చేసుకుందాం .. అంటూ తనకు చెప్పేశాను. ఆ తర్వాత ఇంట్లో చెప్పి పెళ్లి చేసేసుకున్నాం. నా దగ్గర డబ్బులు లేవు.. ఇప్పుడిప్పుడే డైరెక్టర్ అవుదామని ట్రై చేస్తున్నా అంటే తను ఓకే చేసిందని'' వివరించారు.

వీడియో వైరల్...:''నిన్నే పెళ్లాడుతా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న టైంలో దొంగ పెళ్లి చేసుకున్నాం. రామ్ గోపాల్ వర్మ వద్ద 1500 రూపాయలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేవాడిని. ఇక ఈ హోటల్ విషయం గురించి తనకు ఓసారి చెప్పాను.. ఆ కోడి తినడం చూసి నిన్ను వదిలేద్దాం అనుకున్నా అని చెప్పాను. కానీ ఆ రోజు తిన్నట్లు ఇన్ని సంవత్సరాల్లో అలా తినడం చూడలేదు'' అంటూ చెప్పుకువచ్చాడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X