»   » నాగబాబు నష్టపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ.... క్లాస్ పీకిన వినాయక్!

నాగబాబు నష్టపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ.... క్లాస్ పీకిన వినాయక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో, తమిళంలో, మళయాలంలో.... స్టార్ హీరోలు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు, భారీ విజయాలు అందుకుంటున్నారు. మన తెలుగు స్టార్ హీరోలు మాత్రం ఎప్పుడూ మూస కథలు, రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ నుండి బయట పడటం లేదు... అంటూ ఈ మధ్య కొందరు విమర్శలు చేస్తున్న విషయం తరచూ చూస్తూనే ఉన్నాం.

అయితే ఇలా విమర్శించే వారికి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు దర్శకుడు వివి వినాయక్. ఇటీవల ఆయన ఓ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....తెలుగు పరిశ్రమ గురించి, తెలుగు స్టార్ హీరోల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు అంటూ వారికి గట్టిగానే క్లాస్ పీకారు.

గతంలో ఇలానే చిరంజీవితో సినిమా తీసిన నాగబాబు నష్టపోయిన విషయాన్ని ఈ సందర్భంగా వివి వినాయక్ గుర్తు చేసుకున్నారు.

 ప్రయోగాలు అవసరం లేదన్న వినయ్

ప్రయోగాలు అవసరం లేదన్న వినయ్

సినిమా అనేది కోట్లాది రూపాయలతో ముడిపడి ఉన్న వ్యాపారం. ఎంతో మంది జీవితాలు ఆ సినిమాపై ఆధారపడి ఉంటాయి. అలాంటపుడు రిస్క్ చేసి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదని వి వినాయక్ అభిప్రాయ పడ్డారు.

 అలాంటి వారికి మాట్లాడే అర్హత లేదు

అలాంటి వారికి మాట్లాడే అర్హత లేదు

తెలుగులో స్టార్ హీరోలంతా స్టార్ డమ్ లోనే ఉండాలి. వారికి సూటయ్యే సినిమాలే చేయాలి. ఇపుడున్న స్టార్స్ అంతా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నారు. క్వాలిటీగా మంచి సినిమాలు తీస్తున్నారు.... మన హీరోలు ప్రయోగాత్మక సినిమాలు చేయడం లేదు అని విమర్శించే వారు ఎవరూ అలాంటి సినిమాలు చేయడం లేదు. అలాంటపుడు వారికి మాట్లాడే అర్హత లేదని చెప్పకనే చెప్పారు వినాయక్.

 నాగబాబు నష్టపోయిన విషయం గుర్తు చేస్తూ

నాగబాబు నష్టపోయిన విషయం గుర్తు చేస్తూ

అప్పట్లో చిరంజీవి సూపర్‌స్టార్‌డమ్‌లో ఉన్న సమయంలో నాగబాబు ‘రుద్రవీణ' సినిమా చేశారు. చిరంజీవితో సినిమా చేస్తే కోట్లు వసూలు చేసే సమయమది. అయినా సరే ఇమేజ్‌ నుంచి బయటకు రావాలని చేసిన మంచి ప్రయత్నమది. అప్పుడు నష్టపోయిన నాగబాబుని ఎవరూ అదుకోలేదు అని వినాయక్ గుర్తు చేసారు. తెలుగులో ‘షో' సినిమా చేసి నేషనల్‌ అవార్డ్‌ సాధించిన నీలకంఠతో ఇపుడు ఎవరూ ప్రోత్సహించడం లేదన్న విషయాన్ని వినాయక్ గుర్తు చేసారు.

 మనల్ని మనం తక్కువ చేసుకోవడం వద్దు

మనల్ని మనం తక్కువ చేసుకోవడం వద్దు

పక్క పరిశ్రమలతో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసి మాట్లాడుకోవద్దు. ఆర్ట్ సినిమాలు, అవార్డ్ సినిమాలు తీయడం చాలా తేలిక. కానీ ఆర్ట్ సినిమా చేసే వారు మర్షియల్ సినిమాలు చేయలేరు. కానీ కమర్షియల్ సినిమాలు చేసే వారు ఈజీగా ఆర్ట్ సినిమాలు చేయగలరు... అని వినాయక్ అభిప్రాయ పడ్డారు.

 అప్పులు, పర్శనల్ లైఫ్, అఖిల్ ప్లాప్ గురించి.... ఓపెన్‌గా చెప్పిన వివినాయక్!

అప్పులు, పర్శనల్ లైఫ్, అఖిల్ ప్లాప్ గురించి.... ఓపెన్‌గా చెప్పిన వివినాయక్!

వివి వినాయక్ గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. వెస్ట్ గోదావరి జిల్లా చాగల్లులో జన్మించిన వినాయక్.... సినిమా కుటుంబంలోనే పుట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

.

English summary
Tollywood Director VV Vinayak said that only commercial movies brings profits to producers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu