»   » అప్పులు, పర్శనల్ లైఫ్, చిరు 150, అఖిల్ ప్లాప్ గురించి.... ఓపెన్‌గా చెప్పిన వివినాయక్!

అప్పులు, పర్శనల్ లైఫ్, చిరు 150, అఖిల్ ప్లాప్ గురించి.... ఓపెన్‌గా చెప్పిన వివినాయక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన వివి వినాయక్ ఆయన సినిమాలకు దర్శకత్వం గురించి ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆయన జీవితం ఎన్నో అనుకోని మలుపులు తిరిగింది. చిరంజీవి 150 సినిమాకు దర్శకత్వం వహించే అద్భుత అవకాశం దక్కించుకున్నారు.

వివి వినాయక్ గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. వెస్ట్ గోదావరి జిల్లా చాగల్లులో జన్మించిన వినాయక్.... సినిమా కుటుంబంలోనే పుట్టారు. అంటే వాళ్ల నాన్న సినిమా ఎగ్జిబిటర్. ఊర్లో వారికి సొంత థియేటర్ ఉంది. అలా సినిమా రంగానికి కనెక్ట్ అయిన వివి వినాయక్.... పెద్దగా చదువు సంధ్యలు లేక పోయినా టాలీవుడ్లో అగ్రస్థాయిని అందుకున్నారు.

తాజాగా డైలాగ్ విత్ ప్రేమ... అనే వెబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన పర్శనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అందులో నుండి కొన్ని వివరాలు మీ కోసం...

అప్పులతో కెరీర్ మొదలు

అప్పులతో కెరీర్ మొదలు

ఇంకా 25 ఏళ్లు కూడా నిండని వయసులో తమ కుటుంబానికి ఉన్న 25 లక్షల అప్పులు తీర్చాలని, నాన్నగారిని కష్టాల నుండి గట్టెక్కాలనే కసితో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు వినాయక్. తొలి నాళ్లలో దర్శకుడు సాగర్ దగ్గర అసిస్టెంటుగా పని చేసానని, నా కెరీర్లో అది టర్నింగ్ పాయింటుగా వినాయక్ చెప్పుకొచ్చారు.

నాన్నకు ఇష్టం లేదు సినిమాల్లోకి రావడం

నాన్నకు ఇష్టం లేదు సినిమాల్లోకి రావడం

నాన్నగారికి నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. నేను డిగ్రీ కంప్లీట్ చేస్తే అప్పట్లో ఆయనుకున్న పరిచయాలతో నన్ను ఎస్సై చేయాలని ఆయన ఆశ. కానీ నాకు చదువు మీద ఆసక్తి అప్పటికే లేదు. దీంతో ఇంటర్మీడియట్ లోనే ఆగిపోయింది నా చదువు అన్నారు.

నాన్నగారు పోయాకే ప్లాపులు

నాన్నగారు పోయాకే ప్లాపులు

నాన్న గారు ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. ఆయన ఉన్నపుడు సినిమా చూసి ఇది బాగోలేదు, ఇది బావుంది అని చెప్పేవారు. ఆయన చెప్పేదాన్ని బట్టి నేను కరెక్షన్ చేసుకునే వాడిని. ఆయన పోయిన తర్వాత ఆయనలా చెప్పేవారు లేక కొన్ని ప్లాపులు ఎదురయ్యాయి. మా నాన్న గారి లేని లోటు 150 సినిమా విషయంలో కనిపించడం లేదు. మళ్లీ ఆ కన్సర్న్ ఈ సినిమాతో చిరంజీవిగారితో వచ్చింది అన్నారు.

చిరంజీవిగారు అలాంటి వారు కాదు

చిరంజీవిగారు అలాంటి వారు కాదు

చిరంజీవి గారు అడిగే డౌట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. అలా అని ఆయనెప్పుడూ తప్పుగా అడగరు, ప్రతి విషయాన్ని ఆయన ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటారు. మనం కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతారు. నేను చెప్పిందే నడవాలి అని మొండిగా ఉండరు. ఆయన ఏం చేసినా సినిమా కోసమే అని వినాయక్ చెప్పుకొచ్చారు.

చిరంజీవి సినిమా అంటే రాజమౌళికి కూడా టెన్షనే

చిరంజీవి సినిమా అంటే రాజమౌళికి కూడా టెన్షనే

చిరంజీవి గారి సినిమా అంటే టెన్షన్ ఉంటుంది. నాకే కాదు... వరుస హిట్లు ఇచ్చిన రాజమౌళి గారికి కూడా ఆయనతో సినిమా అంటే టెన్షనే. చిరంజీవి గారు కూడా టెన్షన్ గానే ఉంటారు. 150వ సినిమా అయినా తొలి సినిమాలా చేస్తారు. ఎందుకంటే ఆయన సినిమాపై కోట్లాది రూపాయల పెట్టుబడి, వందల మంది కష్టం, కోట్లాది మంది అభిమానం అన్నీ ఇన్ వాల్వ్ అయి ఉంటుంది. అందుకే ఆయన సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అని వినాయక్ చెప్పుకొచ్చారు.

మేమే అలసి పోయాం, ఆయన కాదు

మేమే అలసి పోయాం, ఆయన కాదు

ఖైదీ నెం 150 మూవీ 84 రోజుల్లో పూర్తి చేసాం. అంతా అనుకున్నట్లే జరిగింది. కొన్ని సార్లు మేమైనా వారం గ్యాప్ దొరికితే బావుండు అనుకున్నాం కానీ.....చిరంజీవిగారు మాత్రం ఎలాంటి అలుపు లేకుండా చేసారు అని వినాయక్ చెప్పుకొచ్చారు.

2003లో వదినగారికి చేయాలని అన్నయ్య చెప్పారు

2003లో వదినగారికి చేయాలని అన్నయ్య చెప్పారు

2003లో ఠాగూర్ సమయంలోనే అన్నయ్య వదిన గారి కోసం నేనో సినిమా చేయాలి, పవన్ కూడా చేయాలి అన్నారు. అప్పుడు అన్న మాట ఈ సినిమాకు నిజమైంది. ఆయన అప్పుడు అన్న మాట ఈ మధ్య 150 షూటింగ్ సమయంలో గుర్తొచ్చింది అని వినాయక్ చెప్పుకొచ్చారు.

150వ మూవీ అవకాశం ఇలా

150వ మూవీ అవకాశం ఇలా

‘ఒక రోజు అన్నయ్య ఫోన్ చేసి, వినయ్ ఒకసారి రా అంటే వెళ్లాను. నేను వెళ్లాక ‘కత్తి చూశావా నువ్వు' అన్నారు. మామూలుగా చూశాను కానీ, అంత పరిశీలనగా చూడలేదన్నయ్యా అన్నా. ‘ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని చూసి, నీ అభిప్రాయం చెప్పు అన్నారు... అలా ఈ సినిమా మొదలయింది అన్నారు వినాయక్.

ఇదే పర్ ఫెక్ట్

ఇదే పర్ ఫెక్ట్

వివరంగా స్క్రిప్టు రాసుకుని ఆయన దగ్గరకు వెళ్ళాను. ఈ సినిమా అయితే మీకు ఫెంటాస్టిక్‌గా ఉంటుందన్నయ్యా అని చెప్పా. పూర్తిగా మెసేజ్ చెప్పినట్టు కాకుండా.. అలాగని ఏమీ లేకుండా చేస్తే మీ స్టేచర్‌కు కరెక్ట్ కాదు... అదంతా ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటూ.. నేను రాసుకున్నా నోట్స్ అంతా చెప్పా. చెప్పగానే అన్నయ్య చాలా ఇంప్రెస్ అయ్యి ఓకే అన్నారు. తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావుగారితో కూర్చుని మేము అనుకున్న స్క్రిప్ట్‌ను ఒక ఆర్డర్‌లో సెట్ చేసి మళ్లీ అన్నయ్యకు వివరించాను. ఒక సినిమా చూస్తే ఎలాగ ఉంటుందో అలా స్టోరీని నెరేట్ చేశాను. అన్నయ్య లేచి నన్ను హగ్ చేసుకుని ఫెంటాస్టిక్‌గా ఉందని చెప్పారు అని వినాయక్ తెలిపారు.

బ్రహ్మీని ఇరికించాం, అలా అనుష్క ఔట్

బ్రహ్మీని ఇరికించాం, అలా అనుష్క ఔట్

రెండుమూడు రోజుల తర్వాత సినిమాలో నాకు బ్రహ్మానందం కావాలి అని అన్నయ్య చెప్పారు. ఆయన పాత్ర నన్ను ఏదైనా అనుమానించేలాగా, లేక నేను ఇరికించేలాగ ఏదైనా వస్తే బాగుంటుందేమో చూడు అన్నారు. అన్నయ్య బ్రహ్మీ కావాలని చెప్పడంతో..... ముందుగా ఇద్దరు హీరోయిన్స్ అనుష్క, కాజల్ అనుకున్న కథలో ఒక్కరే హీరోయిన్ ఉండాల్సిన పరిస్థితి. మేము సంప్రదించే సమయానికి అనుష్క బిజీ అయిపోయింది. ఫైనల్‌గా కాజల్ ఓకే అయింది అని వినాయక్ చెప్పారు.

ఆ కామెడీ ఉంటుంది

ఆ కామెడీ ఉంటుంది

ఖైదీ నెం 150లో ‘రౌడీ అల్లుడు, దొంగ మొగుడు' సినిమాల్లో ఉన్న కామెడీ తరహాలో సీన్లు ఉంటాయి. అలాగే హాస్య నటుడు బ్రహ్మానందాన్ని చిరంజీవి ఆటపట్టించే సీన్లు చాలాబాగా ఉంటాయి. డాన్స్ విషయంలో అన్నయ్య అదరగొట్టారు. చిరంజీవిని చూసి ఓ మనిషి పట్టుదల ఎలా ఉంటుందో నేర్చుకోవాలనిపిస్తుంది. ప్రతి పాటలోనూ సర్‌ప్రైజింగ్ స్టెప్స్ ఉంటాయని వినాయక్ చెప్పుకొచ్చారు.

హీరోయిన్ అంజలా జవేరి బర్త

హీరోయిన్ అంజలా జవేరి బర్త

విలన్ తరుణ్ అరోరాను ఓ తమిళ సినిమాలో చూసా, కొత్తగా ఉన్నాడనిపించింది. తర్వాత అతను హీరోయిన్ అంజలా జవేరి భర్త అని తెలిసింది.

క్రెడిట్ ఇవ్వాలి

క్రెడిట్ ఇవ్వాలి

ఎవరైనా సినిమాకు పని చేస్తే వారికి క్రెడిట్ ఇవ్వాలి, సినిమా పరిశ్రమలో పని చేసే ఎవరైనా తమకు గుర్తింపు రావాలనే కోరుకుంటారు. చేసిన పనికి క్రెడిట్ ఇవ్వక పోవడం దారుణం. అలా చేయడం నాకు ఇష్టం ఉండదు.

సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో థియేటర్లు కొంటున్నా

సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో థియేటర్లు కొంటున్నా

సినిమాల ద్వారా వచ్చింది సినిమాల మీదే పెట్టడం నాకు అలవాటు. వైజాగ్ లో మూడు థియేటర్ల విమాక్స్ కాంప్లెక్స్ మాదే. ఇంకా థియేటర్లు ఉన్నాయి. సామర్ల కోట సత్యక్రిష్ణ, చాగల్లులో వెంటక్రిష్ణ, రాజమండ్రిలో కూడా మల్టీప్లెక్స్ స్టైల్ లో కట్టాలని ఉంది. ఎప్పుడో సైట్ కొని పెట్టామని వినాయక్ తెలిపారు.

నా సినిమాల వల్ల ఎవరూ నాశనం కాలేదు

నా సినిమాల వల్ల ఎవరూ నాశనం కాలేదు

నా సినిమాలు ప్లాపు కొన్ని ప్లాపయ్యాయి కానీ వాటి వల్ల నాశనం అలాంటివైతే జరుగలేదు. యోగి సినిమా ప్లాపైనా లాస్ వచ్చి, ఆఫీసులు ఎత్తేసేంత కాదు. అఖిల్ సినిమాకు కూడా నైజాంలో 6 కోట్లు వచ్చాయి. హీరోకు సూపర్ హిట్టయితే వచ్చినంత అది. వైజాగ్ లో రెండున్నర మూడు కోట్లు వచ్చాయి. అయితే ఆ సినిమాను మేము అమ్మింది ఇంకా ఎక్కువ రేటుకు. నెంబరాఫ్ థియేటర్స్ పెట్టేసామని వినాయక్ తెలిపారు.

అఖిల్ వల్ల లాస్ వస్తే నేను డబ్బు తిరిగిచ్చా

అఖిల్ వల్ల లాస్ వస్తే నేను డబ్బు తిరిగిచ్చా

అఖిల్ సినిమాను కొన్న వారిలో నా రెగ్యులర్ డిస్ట్రిబ్యూర్లు కూడా ఉన్నారు. వారికి నష్టపోయిన దాంట్లో సగం ఇచ్చేసారు. నేను ఎంత డబ్బు ఇస్తే మీరు హ్యాపీగా ఉంటారో అడిగి వారికి డబ్బు తిరిగి ఇచ్చేసాను. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ కూడా వదిలేసాను అని వినాయక్ తెలిపారు.

సచిన్ చెప్పాడు...

సచిన్ చెప్పాడు...

సెలబ్రిటీ అయ్యాక, పేరొచ్చిన తర్వాత... నీ గురించి మంచి వచ్చినా, చెడు వచ్చినా పట్టించుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లిపో..... అని సచిన్ టెండూల్కర్ చెప్పిన మాటను నా ఫ్రెండ్ నాకు చెప్పాడు. నేను దాన్నే ఫాలో అవుతా. అఖిల్ సినిమా విషయంలో నేను చేసింది అదే అన్నారు.

అఖిల్ మూవీని ది బెస్టాగా తీసాం

అఖిల్ మూవీని ది బెస్టాగా తీసాం

అఖిల్ సినిమా మా క్రాఫ్ట్ సైడ్ ది బెస్ట్ గా తీసాం, ఆ సినిమా కథకి మేము ఏమనుకున్నామో అలా తీసాం. మేము అలా అనుకోవడం తప్పు అయి ఉండొచ్చు. తీయడంలో లోపం జరుగలేదు. టేకింగ్ లో ఎక్కడా కూడా నాన్సెన్సుగా అయితే లేదు. మీరు కథే నాన్సెన్స్ అని ఫీలయితే ప్రతీదీ బాగోలేదనే అనిపిస్తుంది. అందులో మంచి విషయాలన్నా పోతాయి. మేకింగ్ వేరే, అన్ న్యాచురల్ విషయం వేరు. మేము అన్ న్యాచురల్ విషయాన్ని తీసుకున్నాం. నా మేకింగ్ లో తప్పేమీ చేయలేదు. మా కర్మకు ఆ కథ అప్పుడు నచ్చింది. రెండు మూడు నెలలు చాలా పెయిన్ ఫీలయ్యాను. ప్యాంటు షర్టు వేసుకుని బయటకే రాలేదు. అఖిల్ ఫస్ట్ సినిమా కదా అని చాలా బాధ పడ్డా.... నా కెరీర్ గురించి, బ్యాడ్ నేమ్ గురించి కంటే అఖిల్ తొలి సినిమాకు ఇలా అయిందనే బాదే ఎక్కువగా ఉంది.

అఖిల్‌కి హిట్టిస్తా, నా బాధ్యత

అఖిల్‌కి హిట్టిస్తా, నా బాధ్యత

నాగార్జునతో సినిమా చేయాలి. ఒకటి రెండు సార్లు అనుకున్నాం కానీ వీలు కాలేదు. అఖిల్ కు మళ్లీ హిట్టివ్వడం ఒక బాధ్యతగా భావిస్తున్నాను అని వినాయక్ చెప్పుకొచ్చారు.

దానవీర సూర కర్ణ

దానవీర సూర కర్ణ

దానవీర సూర కర్ణ గరించి అపుడు అనుకున్నాం. కానీ జరుగలేదు. అదుర్స్ 2 చేద్దామని ఎన్టీఆర్ అంటున్నాడు కానీ దానికి తగ్గ కథ దొరుకుతుందని అనుకోను.... అని వినాయక్ తెలిపారు.

పెళ్లి గురించి...

పెళ్లి గురించి...

ఆది క్లైమాక్ష్ సమయంలో నా నిశ్చితార్థం జరిగింది, సినిమా రిలీజైన పది రోజులకు పెళ్లి జరిగింది. వాస్తవానికి నా పెళ్లి కాకినాడలో జరుగాలి. ఆది హిట్టయిన తర్వాత మా మా నాన్న గారు పరిస్థితి చూసి పెళ్లి మా వూరుకు షిప్ట్ చేసారు. జాతరలా జరిగింది. ఎన్టీఆర్ వస్తే బయటకు ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. ఎన్టీఆర్ మా ఊరిలో ఇళ్ల మీద నుండి దూకి వెల్లాల్సి వచ్చింది అని వినాయక్ చెప్పుకొచ్చారు.

English summary
V. V. Vinayak is an Indian film director and screen writer known for his works exclusively in Telugu cinema. Vinayak made his film debut with the 2002 melodrama film Aadi starring NTR Jr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu