శ్రీరెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్.. అక్కడే చంపేసి ఉంటా, అలాంటి వాళ్ళతో బూతులే.. డిస్కో శాంతి!

Recommended Video

Disco Shanti Makes Serious Comments On Sri Reddy

గత కొన్ని నెలలుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలని కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వేధిస్తోంది. కాస్టింగ్ కౌచ్ విషయాన్ని ప్రస్తావిస్తూ నటి శ్రీరెడ్డి ఇండస్ట్రీ ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు ఇండస్ట్రీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థనగ్న నిరసన చేసిన తరువాత ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. శ్రీహరి సతీమణి డిస్కో శాంతి తాజాగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై స్పందించారు. శ్రీరెడ్డికి ఘాటుగా చురకలు అంటించారు.

అన్ని చోట్ల

అన్ని చోట్ల

కాస్టింగ్ కౌచ్, మహిళా వేధింపులు అన్ని చోట్ల జరుగుతున్నాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు మహిళలు ఊరుకుని ఉండకూడదు. వెంటనే ప్రతిఘటించాలి అని డిస్కో శాంతి అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు.

లాగి ఒక్కటిస్తే

లాగి ఒక్కటిస్తే

శ్రీరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మగాడు వచ్చి అడిగితే కుదరదని చెప్పాలి. నువ్వు ఎందుకు ఓకె చెప్పావు. మగాడు బలవంతంగా తీసుకునిపోతే నేరం. నువ్వు ఇష్టపడే వెళ్ళినపుడు ఏం చేస్తున్నావు. అడిగిన వెంటనే లాగి ఒక్కటిస్తే నే జోలికి ఎందుకు వస్తాడు అని డిస్కో శాంతి శ్రీరెడ్డిపై ఫైర్ అయింది.

అంతా జరిగాక

అంతా జరిగాక

అంతా జరిగాక అందరిని నిందిస్తూ మాట్లాడకూడదు. బహుశా మీడియాలో హైలైట్ కావాలని అలా చేసి ఉండవచ్చు అంటూ డిస్కో శాంతి శ్రీరెడ్డికి చురకలు అంటించారు. ప్రముఖులపై ఆరోపణలు చేస్తే పబ్లిసిటీ వస్తుందని అన్నారు.

అక్కడే చంపేస్తా

అక్కడే చంపేస్తా

నాకు ఇండీస్ట్రీలో ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు. ఎందుకంటే నేనెంటో అందరికి తెలుసు. నన్ను అడిగితే అక్కడే చంపేసి ఉంటా. అలాంటి వారికీ తాను గౌరవం ఇవ్వనని, బూతులే మాట్లాడతానని డిస్కో శాంతి ఘాటుగా వ్యాఖ్యానించారు.

 హడావిడి

హడావిడి

ప్రస్తుతం మూడేళ్ళ పిల్లాడి వద్ద కూడా ఇంటర్ నెట్ ఉంటోంది. ఏ చిన్న విషయం జరిగిన మీడియాలో హడావిడి ఎక్కువైపోతోంది డిస్కో శాంతి అన్నారు. ఇండస్ట్రీలో మరీ ఆస్థాయిలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుంటే మీడియా ఈపాటికే బయటపెట్టేది. అన్నిచోట్లా జరుగుతున్నట్లే ఇక్కడ కూడా కొన్ని తప్పుడు జరుగుతూ ఉండొచ్చని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X