పూరీ సినిమాతో ‘ఇస్మార్ట్ శ్రీను’ అయిపోయాడు.. వాళ్లు చెప్పినట్లే జరిగిందంటూ..

'ఇస్మార్ట్ శంకర్'.. పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, భారీ వసూళ్లను రాబడుతోంది. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు డిస్టిబ్యూటర్లు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇదే విషయాన్ని కొత్త డిస్టిబ్యూటర్ శ్రీను వెల్లడించారు. ఆయన 'ఇస్మార్ట్ శంకర్'కు డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించారు. దీంతో ఈ సినిమా ద్వారా భారీ కలెక్షన్లను అందుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీను తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.

పెద్ద మొత్తం డ‌బ్బుతో పాటు అద‌నంగా న‌మ్మ‌కాన్ని కూడా పెట్టుబ‌డిగా పెట్టి చేయాల్సిన వ్యాపారం డిస్ట్రిబ్యూష‌న్‌. లాభాలు వ‌స్తే వ‌చ్చిన‌ట్టు. ఆ సినిమా ప్రేక్ష‌కుడికి న‌చ్చ‌క‌పోతే భారీ స్థాయిలో నష్టాలు ఎదురవుతాయి. అందుకే ఈ వ్యాపారంలో న‌మ్మ‌కానికి, అదృష్టం తోడు కావాల‌ని అంటారు. ఈ మ‌ధ్య కాలంలో డిస్ట్రిబ్యూట‌ర్‌గా అలా న‌మ్మ‌కాన్ని, అదృష్టాన్ని త‌న‌వెంట పెట్టుకుని 'ఇస్మార్ట్'గా ముందుకు అడుగులు వేస్తున్నారు శ్రీను. నిన్నటి దాకా ఆయ‌న కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ శ్రీను. ఇప్పుడు మాత్రం 'ఇస్మార్ట్ శంక‌ర్‌'తో డిస్ట్రిబ్యూట‌ర్‌గా హ్యాట్రిక్ హిట్ సాధించి 'ఇస్మార్ట్ శ్రీను'గా మారాడు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడాడు.

Distributor Srinu happy With iSmart Shankar Result

తన కెరీర్‌ను ఎలా మొదలు పెట్టారు? ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు పంపిణీ చేశారు? 'ఇస్మార్ట్ శంకర్' ఆయన వరకు ఎలా వెళ్లింది తదితర విషయాలను వెల్లడించారు. ''మా కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ సంస్థ త‌ర‌ఫున నైజామ్‌లో మొద‌ట 'క‌బాలీ' చేశాను. ర‌జ‌నీకాంత్ హీరోగా చేసిన ఆ సినిమా చాలా మంచి క‌లెక్ష‌న్లు తెచ్చింది. ఆ త‌ర్వాత 'హుషారు' డిస్ట్రిబ్యూట్ చేశాను. యూత్‌ఫుల్ స‌బ్జెక్ట్ తో ఈ సినిమా కుర్ర‌కారును థియేట‌ర్ల‌లో కూర్చోబెట్టింది. 'ఉండిపోరాదే' అంటూ స‌క్సెస్‌లు మాతో ఉండేలా చేసింది. స‌క్సెస్‌ఫుల్‌గా ద్వితీయ విఘ్నం దాటేశాన‌ని మిత్రులంద‌రూ అప్పుడు అభినందించారు. మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఆ క్ష‌ణాల్లోనే బ‌లంగా కోరుకున్నా. అందుకే తొంద‌ర‌ప‌డ‌కుండా ఆచితూచి అడుగులు ముందుకేశా.

పూరీ జ‌గ‌న్నాథ్‌గారు, హీరో రామ్ గారి కాంబినేష‌న్‌లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' రూపొందుతున్న‌ప్ప‌టి నుంచే నాకు క్రేజీగా అనిపించింది. రామ్‌గారి తెలంగాణ యాటిట్యూట్ కొత్త‌గా అనిపించింది. సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని పూరిగారిని, ఛార్మిగారిని క‌లిసి ఈ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కులు తీసుకున్నా. నేను అనుకున్న‌ట్టుగానే బాక్సాఫీస్‌ను ఈ సినిమా షేక్ చేస్తోంది. థియేట‌ర్ల‌లో సినిమాను చూసి బ‌య‌ట‌కొస్తున్న ఫ్యాన్స్ పూరీ గారి 'పోకిరి' చిత్రం గుర్తుకొస్తోందని అంటున్నారు. ఈ సినిమా నాకు హ్యాట్రిక్ హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది.

ఈ విష‌యాన్నే పూరిగారితో, ఛార్మిగారితో అన్నాను. వాళ్లిద్ద‌రూ ఇక నిన్ను అంద‌రూ 'ఇస్మార్ట్ శ్రీను' అంటారు అని అన్నారు. వారి మాట‌లు చాలా ఆనందం క‌లిగించాయి. 'RX100' కార్తికేయ హీరోగా న‌టించిన 'గుణ 369' ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కులు తీసుకున్నా. అదొక య‌థార్థ‌గాథ‌తో తెర‌కెక్కించిన చిత్రం. మాన‌వ విలువ‌ల్ని ట‌చ్ చేసే క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఇప్ప‌టిదాకా చేసిన ఈ మూడు సినిమాల విష‌యంలో నా అంచ‌నాలు త‌ప్పు కాలేదు. నా మూడు చిత్రాల విజ‌య‌ప‌రంప‌ర‌ను 'గుణ 369' కొన‌సాగిస్తుంద‌ని నా న‌మ్మ‌కం. భ‌విష్య‌త్తులోనూ మంచి మంచి సినిమాల‌ను పంపిణీ చేసి, మా సంస్థ పేరును 'ఇస్మార్ట్'గా నిల‌బెట్టుకోవాల‌ని అనుకుంటున్నా'' అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X