జైలర్ నుంచి గేమ్ ఛేంజర్ వరకు.. సునీల్ తీసుకొంటున్న రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇండస్ట్రీకి చాలామంది నటులు ఒకటి అవ్వాలని వస్తారు.. కానీ, విధి వారిని ఇంకోవైపుకు తీసుకెళ్తుంది. నటుడు సునీల్ కూడా విధి అలానే మార్చేసింది. భీమవరం నుంచి వచ్చిన సునీల్.. ఇండస్ట్రీలో మంచి డ్యాన్సర్ కావాలని వచ్చాడు. కానీ, అనుకోకుండా కమెడియన్ గా మారాడు. అయితే ఆ కలను ఒకపక్క సినిమాల్లో సునీల్ అప్పుడప్పుడు నెరవేర్చుకుంటూనే విలన్ గా మారాడు.
కమెడియన్ గా స్టార్ డమ్ ను అందుకున్న సునీల్.. హీరోగా మారి చేతులు కాల్చుకున్నాడు. ఆ తరువాత కమెడియన్ గా, హీరోగా రెండు పడవల మీద కాళ్ళు వేసి కొంతవరకు ప్రయాణం చేసినా అది కత్తిమీద సాములా మారడంతో.. ఇవన్నీ వదిలేసి ప్రస్తుతం విలన్ గా కొనసాగుతున్నాడు. మరి సునీల్.. విలన్ గా ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనిరేషన్ అందుకుంటున్నాడో చూద్దాం.

మొదట్లో స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మెప్పించిన సునీల్ కు.. అతని ఫ్రెండ్ త్రివిక్రమ్ కథ అందించిన చిరునవ్వుతో సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఈ సినిమా తరువాత నువ్వు నేను సినిమా సునీల్ కు వెనక్కి తిరిగి చూడకుండా చేసింది. అప్పట్లో సునీల్ లేని సినిమా ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. నువ్వే కావాలి, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు అతనికి మంచి గుర్తింపు సాధించి పెట్టాయి.
Roja: రోజాపై తీవ్ర అవినీతి ఆరోపణలు.. 10 లక్షల దుర్వినియోగం.. జబర్దస్త్ టీమ్‌తో చిందులు, విందులు!
ఇక ఆ తరువాత అందాల రాముడు సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమా సునీల్ కి హీరోగా మంచి గుర్తింపును ఇచ్చిందే కానీ, తరువాతి సినిమాలు ఏమి అతనికి కలిసిరాలేదు. దీంతో మళ్లీ కెరీర్ ను గాడిలో పెట్టె ప్రయత్నం చేశాడు. తన ఫ్రెండ్ త్రివిక్రమ్ మళ్లీ సునీల్ ను కమెడియన్ గా మార్చేశాడు. ఇక కలర్ ఫోటో సినిమా ద్వారా సునీల్ విలన్ గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అతనికి మంచి గుర్తింపు అందించింది.
ఇక ఇప్పటివరకు సునీల్ లో కమెడియన్ ను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా అతనిలోని విలనిజాన్ని చూసి షాక్ అయ్యారు.సుకుమార్ పుష్ప సినిమాతో దానికి సాన పెట్టాడు. ఇంకేముంది.. పుష్పలో విలన్ గా సునీల్ అదరగొట్టాడు. విలన్ గా స్టార్ డమ్ అందుకున్నాడు. పుష్ప తరువాత సునీల్ ఏకంగా 17 సినిమాల్లో నటించాడు. గతేడాది 12 సినిమాలు చేస్తే 7 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు లోనే కాకుండా తమిళ్, మలయాళంలో కూడా సునీల్ ను ఆపడం కష్టంగా మారింది.

జైలర్, మార్క్ ఆంటోని, ఇటీవల వచ్చిన టర్బో, సినిమాలతో అక్కడ కూడా హిట్స్ ను అందుకున్నాడు. గేమ్ ఛేంజర్, పుష్ప 2 సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే స్టార్ కమెడియన్ గా ఉన్నప్పుడు సునీల్ తీసుకున్న పారితోషికం కన్నా ఇప్పుడు విలన్ గా తీసుకుంటున్న రెమ్యూనిరేషన్ చాలా తక్కువ అని సమాచారం. సునీల్ ఒక్కో తెలుగు సినిమాకి రూ.40 లక్షలు అందుకుంటున్నట్లు సమాచారం.
కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మంచి డిమాండ్ ఉండటం వల్ల రూ.60 నుంచి 80 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే సంవత్సరానికి ఆయన ఈజీగా రూ.5 కోట్లు సంపాదిస్తున్నాడు. ఒకప్పుడు కమెడియన్ గా ఒక్కో సినిమాకు ఇంత కన్నా ఎక్కువ అందుకునేవాడట. కానీ వరుస సినిమాలతో అలరించడంతో ఎక్కువ ఆఫర్స్ వస్తుండడంతో సునీల్ కు మంచి పేరునే వస్తుంది. ప్రస్తుతం సునీల్ పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరి ముందు ముందు ఈ పారితోషికం పెరుగుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











