For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రవితేజ సిగరెట్ కూడా తాగడు.. డ్రగ్స్‌తో లింకా? భరత్ చనిపోయిన రోజు మత్తులో లేడు..

  By Rajababu
  |

  ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే మాస్ మహారాజా రవితేజకు డ్రగ్స్ సప్లయర్లతో సంబంధాలున్నాయనే వార్తలు సినీ వర్గాలను ఉలిక్కిపడేలా చేశాయి. డ్రగ్ కేసులో ఇటీవల రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. త్వరలోనే ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులు, ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రవితేజ, ఇటీవల మరణించిన ఆయన సోదరుడు భరత్ గురించి ఆసక్తికరమైన విషయాలను కుటుంబ వైద్యుడు, సన్నిహితుడు రాజేంద్ర కడియాల మీడియాకు వెల్లడించారు.

  రవితేజకు డ్రగ్స్ సంబంధం లేదు..

  రవితేజకు డ్రగ్స్ సంబంధం లేదు..

  హీరో రవితేజకు డ్రగ్స్ వినియోగించే అలవాటు లేదు. సప్లయర్లతో సంబంధం లేదు. డ్రగ్స్ కేసులోకి ఆయన పేరు వినిపించడం చాలా బాధగా ఉంది. ఈ విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులు కూడా కుమిలిపోతున్నారు అని రాజేంద్ర అన్నారు. రవితేజకు సిగరెట్ వాసన కూడా పడదన్నారు. రవితేజపై అసత్య ప్రచారం జరుగడం సన్నిహితుడిగా ఆవేదన చెందుతున్నానని ఆయన పేర్కొన్నారు.

  హైదరాబాద్‌లో లేడు.. త్వరలోనే మీడియాతో..

  హైదరాబాద్‌లో లేడు.. త్వరలోనే మీడియాతో..

  రవితేజ ప్రస్తుతం హైదరాబాద్‌లో లేరు. అవుట్‌డోర్‌ షూటింగ్‌లో ఉన్నారు. అందుకే ఆయన మీడియా ముందుకు రాలేకపోయారు. రవితేజపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందికాబట్టి తాను మీడియా ముందుకు వచ్చాను అని రాజేంద్ర వివరించారు. డ్రగ్స్‌ వ్యవహారంలో రవితేజకు సంబంధం లేదన్న విషయం విచారణలో తేలుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  Ravi Teja's mother Rajyalaxmi Reacted on Her Son Drug Rumors
  రవితేజ పేరు బయటకు రావడం..

  రవితేజ పేరు బయటకు రావడం..

  మాదక ద్రవ్యాల కేసులో రవితేజ పేరు బయటకు రావడం తనకు బాధ కలింగించింది. రవితేజకు ఎలాంటి దురలవాట్లు లేవు. తన కుమారుడు సిగరెట్‌ కూడా తాగడు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటాడు. అలాంటి వారిని ప్రోత్సాహించడు. రవితేజకు డ్రగ్స్‌ అలవాటు ఉందనడం అవాస్తవం. కావాలనే ఈ కేసులో అతడిని ఇరికిస్తున్నారు అని రవితేజ తల్లి రాజ్యలక్ష్మి ఆరోపించారు.

  ఈ నెల 24న సిట్ ముందుకు రవితేజ

  ఈ నెల 24న సిట్ ముందుకు రవితేజ

  డ్రగ్ కేసులో నోటీసులు అందుకొన్న నేపథ్యంలో రవితేజ ఈ నెల 24న సిట్‌ ముందు విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. కెల్విన్‌తో సంబంధాలు, ఫోన్ డేటా ఆధారంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 19న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, 20న హీరోయిన్‌ ఛార్మీ, 21న ముమైత్‌ ఖాన్‌, 22న నటుడు సుబ్బరాజు, 23న సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు సిట్‌ ఎదుట హాజరుకాబోతున్నారు.

  భరత్ మరణించినప్పుడు మద్యం మత్తులో లేడు..

  భరత్ మరణించినప్పుడు మద్యం మత్తులో లేడు..

  రవితేజ తమ్ముడు భరత్‌ గురించి నాకు బాగా తెలుసు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రోజున భరత్ మద్యం మత్తులో లేడు. ఆ రోజు ఆయన మద్యం కూడా తాగలేదు అని డాక్టర్‌ రాజేంద్ర వెల్లడించారు. డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయాడు. దురలవాట్లను మొత్తంగా మానుకున్నారు అని ఆయ చెప్పారు.

  బిగ్‌బాస్‌కు కూడా సెలెక్ట్ అయ్యాడు..

  బిగ్‌బాస్‌కు కూడా సెలెక్ట్ అయ్యాడు..

  భరత్ మారుతున్న క్రమంలోనే మృత్యువాత పడ్డారు. బిగ్‌బాస్‌ తెలుగు వెర్షన్‌కు కూడా సెలెక్టయ్యానని ఇటీవల ఆనందంగా చెప్పారు. చెడు అలవాట్లు మానేసిన తర్వాత భరత్‌ చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. భరత్ అంత్యక్రియల విషయంలోనూ రవితేజ కుటుంబాన్ని మీడియా తప్పుగా చిత్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రవితేజ కుటుంబం గురించి నాకు పూర్తిగా తెలుసు. వారిపై అసత్య ప్రచారం చేయొద్దని మీడియాను వేడుకొన్నారు.

  English summary
  Investigation of Drug links with Tollywood is moving with fast manner. Officials are interogating the Drug supplier Kelvin in their custody. Reports suggest that Kelvin has told many interesting and shocking things to officials. In this situation, Raviteja family doctor Rajendra Kodiyala condemns alllegation made on actor. He said Raviteja is not having a cigarette habit. In Drug case actors Raviteja, Charmi, Mumaith Khan, Navadeep are going to attend before SIT from 19th July. In this connection, Police may arrest few tollywood celebrities soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X