సుబ్బరాజు నుంచి కీలక సమాచారం.. పూరీ మెడకు బిగుస్తున్న ఉచ్చు..
డ్రగ్స్ కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకొంటున్నాయి. విచారణ సందర్భంగా నటుడు సుబ్బరాజు ఇచ్చిన ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారినట్టు వినిపిస్తున్నది. సుబ్బరాజు వెల్లడించిన అంశాలు కేసుకు చాలా ఉప
డ్రగ్స్ కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకొంటున్నాయి. విచారణ సందర్భంగా నటుడు సుబ్బరాజు ఇచ్చిన ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారినట్టు వినిపిస్తున్నది. సుబ్బరాజు వెల్లడించిన అంశాలు కేసుకు చాలా ఉపయోగపడుతాయనే అభిప్రాయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. సుబ్బరాజు వెల్లడించే అంశాలు పూరీకి ఇబ్బందిగా మారే అవకాశముంటుందనే మాట వినిపిస్తున్నాయి.

పూరీ గ్యాంగ్‌పై అనుమానాలు
డ్రగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వారంతా పూరీ జగన్నాథ్ క్యాంప్‌కు చెందిన వారు కావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ సప్లయర్లతో పూరీ గ్యాంగ్‌కు పూర్తిస్థాయి సంబంధాలున్నాయనే మాట వినిపిస్తున్నది.

పూరీకి అనుకూలంగానే రాయాలా?
డ్రగ్ కేసులో సంబంధం లేకపోతే 10 గంటలపాటు ఎందుకు విమర్శిస్తారనే వాదనను మీడియా వ్యక్తం చేస్తున్నది. ఈ వ్యవహారంలో పూర్తి వాదనను పలు మీడియా సంస్థలు తప్పుపడుతున్నాయి. పూరీ అనుకూలంగా వార్తలు మాత్రమే రాయాలా అనే ప్రశ్నిస్తున్నారు. కేసులో ఆరోపణలు రావడంతో పోలీసులు తమ పాత్రను నిర్వర్తించారు. అలాగే మీడియా తన పాత్రను పోషించిందని చెప్తున్నారు.

27న విచారణకు ముమైత్
పూరీకి సన్నిహితురాలు నటి ముమైత్ ఖాన్‌ను ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని తెలియజేసినట్లు చెప్పారు. శనివారం ఉదయం నటుడు తరుణ్‌ను విచారిస్తామన్నారు. కేసు విచారణ పూర్తయిన తర్వాత దర్యాప్తు వివరాలను మీడియాకు వివరిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు.

వచ్చే వారం ఎలిమినేషన్ తప్పదా?
ప్రస్తుతం ముమైత్ ఖాన్ బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్నారు. దాదాపు 70 రోజులపాటు పాల్గొంటారు. ఒకవేళ షో నుంచి ఎలిమినేట్ అయితే తప్ప వచ్చేవారం ముమైత్ విచారణకు హజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్ షో నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ముమైత్ ముందు వరుసలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











