డ్రగ్స్ కేసు: పూరీపై బండ్ల గణేష్ స్పందన ఇదీ.... వర్మ మరోసారి సబర్వాల్ విచారణపై ఇలా

డ్రగ్స్ కేసు పూరీ జగన్నాధ్‌ చుట్టూ ఈ కేసు తిరుగుతుండడంపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. పూరీ జగన్నాథ్‌తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పాడు.

By Pratap

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణపై వరసగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ సిట్ వరుసగా సినీ ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది.

గత కొద్ది రోజులుగా డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ కీలకంగా మారారు. తెలుగులో స్టార్ హీరోలతో అతి తక్కువ సమయంలో సినిమాలు తీస్తూ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.

అయితే ఈ డ్రగ్స్ కేసు ఆయనను తీవ్ర వేదనకు గురి చేసినట్లు కనిపిస్తోంది. మీడియాలో వస్తున్న కథనాలు తననెంతో బాధించాయని పూరీ అన్నారు.

బండ్ల గణేష్ ఇలా

బండ్ల గణేష్ ఇలా

డ్రగ్స్ కేసు పూరీ జగన్నాధ్‌ చుట్టూ ఈ కేసు తిరుగుతుండడంపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. పూరీ జగన్నాథ్‌తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పాడు. డ్రగ్స్ కేసులో వస్తున్న ఆరోపణల గురించి తనకు తెలియదని, కానీ ఇలాంటి ఆరోపణల తర్వాత తిరిగి మళ్లీ సినిమాలు చేసేంత ఏకాగ్రత ఉండదని బండ్ల గణేష్ చెప్పాడు. అయితే పూరీ ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతాడని, ఓ మంచి బ్లాక్‌బస్టర్‌ను అందిస్తాడని బండ్ల గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Recommended Video

Drugs Scandal : Actor Nandu Emotional Convince about his Drug Addicted Issue
మళ్లీ రామ్ గోపాల్ వర్మ మరోసారి...

మళ్లీ రామ్ గోపాల్ వర్మ మరోసారి...

డ్రగ్స్‌ కేసులపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి స్పందించారు. బాహుబలి-2 సినిమాతో తెలంగాణకు గొప్ప పేరు వచ్చిందని, ఇప్పుడీ డ్రగ్‌ కుంభకోణంతో చెడ్డపేరు వస్తోందని ఆయన అన్నారు. ఈ డ్రగ్స్‌ కేసు హైదరాబాద్‌ పేరుప్రతిష్ఠలను తీవ్రంగా దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ ఇంత చెడ్డ నగరమా అని ముంబై ప్రజలు తనను అడుగుతున్నారని చెప్పారు. అకున్‌ సభర్వాల్‌ నేతృత్వంలోని సిట్‌ సినిమా వ్యక్తులపై చేస్తున్న ఈ విచారణ ద్వారా ఏమీ వెల్లడి కాదని అన్నారు.

దేవుడిచ్చిన కానుక

దేవుడిచ్చిన కానుక

ఈ జీవితం దేవుడిచ్చిన కానుక అని, అలాంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దని టాలీవుడ్‌ హీరోయిన్‌ కేథరిన్‌ ట్రెసా అన్నారు. గౌతమ్‌నందా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సినిమా పరిశ్రమలో డ్రగ్స్‌ వ్యవహారంపై విచారణ జరుగగుతోందని తెలుసునని, కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటో తనకు తెలియదని కేథరిన్‌ చెప్పారు. డ్రగ్స్‌ వాడకాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని చెప్పారు.

పూరీ జగన్నాథ్‌తో ప్రారంభమై...

పూరీ జగన్నాథ్‌తో ప్రారంభమై...

డ్రగ్స్ కేసు విచారణ పూరీ జగన్నాథ్‌తో ప్రారంభమై ఇంకా కొనసాగుతోంది.. శ్యామ్ కె. నాయుడు, నవదీప్, తరుణ్, చిన్నాలను ఎక్సైజ్ అధికారులు ఇప్పటి వరకు ప్రశ్నించారు. బుధవారం హీరోయిన్ చార్మి విచారణను ఎదుర్కుంటున్నారు. రవితేజ, ముమైత్ ఖాన్ తదితరులను ఇంకా విచారించాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X