ఘట్టమనేని ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. కృష్ణ క్లాసిక్ సాంగ్ రీమేక్‌లో గల్లా అశోక్
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనళ్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. గత ఏడాది సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినా.. ఎట్టకేలకు మొదటి ప్రాజెక్ట్‌ను మెల్లిమెల్లిగా పూర్తి చేస్తున్నారు. ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే నేడు ఈ మూవీ నుంచి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చి అందర్నీ షాక్‌కు గురి చేశారు. నేడు సూపర్ స్టార్ కృష్ణ బర్త్. ఈ సందర్భంగా ఘట్టమనేని ఫ్యాన్స్‌కు తన తరుపున ఈ గిఫ్ట్‌ను అందించాడు.

ధైర్యసాహాసాలకు మారుపేరు..
తెలుగు చిత్ర సీమను సాంకేతికత పేరుతో పరుగులు పెట్టించిన స్టార్ కృష్ష. మొదటి డీటీఎస్, మొదటి 70 ఎమ్ఎమ్, మొదటి స్టీరియో స్కోప్, మొదటి కౌబాయ్ చిత్రాలను తీసి తెలుగు సినీ చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని లిఖించాడు. అంతటి డేరింగ్ అండ్ డాషింగ్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తున్నాయి.

టాలీవుడ్ విషెస్..
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులంతా విషెస్ చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియా మొత్తం కృష్ణ హవానే నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి హీరోలు, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, దర్శకులు అందరూ కృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్..
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ప్రతీ ఏడాది ఓ గిఫ్ట్ ఇవ్వడం మహేష్ బాబుకు అలవాటు. ఈ క్రమంలో తన 27వ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను నేడు ప్రకటించి ఫ్యాన్స్ అందర్నీ ఖుషీ చేశాడు. సర్కారు వారి పాట అంటూ రిలీజ్ చేసిన టైటిల్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. తాజాగా మరో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఫ్యాన్స్‌ను కవ్విస్తోంది.
Recommended Video

గల్లా అశోక్ ఎనర్జీ సూపర్..
యమలీల సినిమాలో కృష్ణ చేసిన స్పెషల్ సాంగ్ జుంబా రే జూ జూంబారేను గల్లా అశోక్ రీమేక్ చేశాడు. ఇందులో కృష్ణ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా అదిరిపోయేలా స్టెప్పులు వేశాడు. నిజంగా అశోక్ ఎనర్జీ ఓ రేంజ్‌లో ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ పాటకు నిధి అందాలు కూడా ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











