మరో రియల్ స్టోరితో రాబోతున్న జార్జిరెడ్డి దర్శకుడు.. హీరోగా స్టార్ డైరెక్టర్ తనయుడు
2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జార్జిరెడ్డి సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సందీప్ మాధవ్ హీరోగా నటించిన ఆ సినిమాను జీవన్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఇక ఆ దర్శకుడు నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయంపై అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. మొత్తానికి ఈ దర్శకుడు సీనియర్ స్టార్ డైరెక్టర్ తనయుడితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

ఆ సినిమాతో బాక్సాఫీస్ హిట్..
ఎన్నో వివాదాల నడుమ విడుదలైన జార్జిరెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకోవడమే కాకుండా ఓ వర్గం ఆడియెన్స్ ఆ సినిమాను అమితంగా ఇష్టపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఒకప్పటి విప్లవాత్మక భావాలను అలాగే అక్కడే జరిగిన హత్యను ఆకట్టుకునే విదంగా తెరకెక్కించిన జీవన్ రెడ్డికి మంచి మార్కులే పడ్డాయి.

కొత్త సినిమా మొదలైంది
ఇక ఆ సినిమా తరువాత రెండేళ్ల వరకు గ్యాప్ తీసుకున్న దర్శకుడు జీవన్ రెడ్డి మరో పవర్ఫుల్ కథతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. మళ్ళీ అతను సందీప్ మాధవ్ తోనే మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ అబద్ధమని తేలిపోయింది. దర్శకుడు గురువారం కొత్త సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టాడు.

హీరోగా పూరి తనయుడు
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మెహబూబా సినిమాతో హిట్ కొట్టాలని అనుకున్న ఆకాష్ పూరి ఉహీంచని విధంగా డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత రొమాంటిక్ అనే సినిమాను స్టార్ట్ చేసినప్పటికీ లాక్ డౌన్ వల్ల ఆ సినిమా వాయిదా పడింది.

రియల్ లైఫ్ స్టోరీ..
ఈ సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. చోర్ బజార్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఫిబ్రవరి 26న మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా ఆకాష్ బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











