Prashanth Varma: ప్రశాంత్ వర్మ 'మహాభారతం'.. పవన్, చిరు, చరణ్, ఎన్టీఆర్, మహేశ్‌కి ఏ క్యారెక్టరో తెలుసా?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఇక ఈ దర్శకుడు యంగ్ హీరో తేజ సజ్జాతో కలిసి ఈ సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా వరుస బెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాపై ఆసక్తిని కలగజేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. మహాభారతం సినిమా తీస్తే.. ఏ క్యారెక్టర్ ఎవరికి సూట్ అవుతుందో ప్రశాంత్ వర్మ తన మనసులో మాట బయటపెట్టాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Brahmamudi January 5th అర్దరాత్రి అడ్డంగా బుక్కైన కల్యాణ్ అనామిక... భార్యకు దొరికిపోయిన రాజ్!
పురాణాలను బేస్ చేసుకుని సినిమాలు తెరకెక్కించడం ఆనాటి కాలం నుంచే ఉంది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ.. ఎన్నో సినిమాల్లో కృష్ణుడిగా, రాముడిగా, అర్జునుడిగా, కర్ణుడిగా ఇలా ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. ఇక ఇటీవల కాలంలో కూడా మళ్లీ పురాణాలను ఆధారంగా తీసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించాడు.

HanuMan Director Prashanth Varma Mahabharatam Stars Mahesh, Pawan, Chiru, Charan, NTR Full List Here

ఇక టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ కథ ఆధారంగా హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ కావడంతో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక సాధారణ వ్యక్తికి హనుమాన్ పవర్స్ వస్తే.. ఏం జరిగిందనే కథాంశంతో తెరకెక్కింది.

ఇక తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే ప్రశాంత్ వర్మ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. ప్రేక్షకులకు సినిమాపై అంచనాలను పెంచేలా చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యలో ప్రశాంత్ వర్మమాట్లాడుతూ.. తనకు మహాభారతం తీయాలని ఉందని ప్రకటించాడు.

HanuMan Director Prashanth Varma Mahabharatam Stars Mahesh, Pawan, Chiru, Charan, NTR Full List Here

ఒకవేళ తాను మహాభారతం తీస్తే ఇప్పుడు ఉన్న నటుల్లో ఎవరెవరిని ఏ పాత్రకి తీసుకుంటారో ఆ ఇంటర్వ్యూలో చెప్పుకుచ్చాడు. యాంకర్ మహాభారతంలోని పాత్రలు అడగ్గా ప్రశాంత్ వర్మ వాటికి తన విజన్ లో ఎవరు సరిపోతారో చెప్పుకువచ్చాడు. ధర్మరాజు పాత్రకి మెగాస్టార్ చిరంజీవి, అర్జునుడు పాత్రకి చరణ్, భీముడు పాత్రకి జూ.ఎన్టీఆర్, సహదేవుడు పాత్రకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నకులుడు పాత్రకి నేచురల్ స్టార్ నాని, కృష్ణుడు పాత్రకి సూపర్ స్టార్ మహేష్ బాబు, దుర్యోధనుడు పాత్రకి మంచు మోహన్ బాబు, కర్ణుడు పాత్రకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ద్రౌపది పాత్రకి నయనతార అంటూ చెప్పుకువచ్చాడు.

ఇలా ప్రశాంత్ వర్మ చెప్పాడో లేదో.. సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ బయటకు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో నిజంగా మహాభారతం సినిమా పడితే బాగుండని టాలీవుడ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందరి పేర్లు చెప్పి.. ప్రభాస్, అల్లు అర్జున్ పేరు చెప్పకపోవడంతో.. వారి ఫ్యాన్స్ కాస్త ఫైర్ అవుతున్నారు. ఇక ప్రశాంత్ వర్మ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X