HBD Puri Jagannadh: ఆ పనితో 85 కోట్లు నష్టం వచ్చినా.. చిరుత వేగంతో టెంపర్ చూపిన పూరీ జగన్నాథ్

పూరీ జగన్నాథ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్. అప్పటి వరకూ టాలీవుడ్‌లో పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. ప్రత్యేకమైన శైలితో సినిమాలు చేస్తూ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడాయన. ఈ క్రమంలోనే తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసి తనను తాను నిరూపించుకున్నాడు.

సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లను అందుకున్న ఈ సంచలన దర్శకుడు.. కొన్నేళ్ల పాటు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ ట్రాక్ ఎక్కి మళ్లీ తన సత్తాను చాటుకున్నాడు. ఇక, ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలపై ఓ లుక్కేద్దాం పదండి!

బద్రీతో మొదలు.. వరుస విజయాలు

బద్రీతో మొదలు.. వరుస విజయాలు

పవన్ కల్యాణ్ నటించిన 'బద్రీ' మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరీ జగన్నాథ్. ఫస్ట్ మూవీతోనే తన సత్తాను చాటి చెప్పిన ఈ దర్శకుడు.. టేకింగ్‌లో కొత్తదనాన్ని చూపించాడు. దీంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీని తర్వాత కూడా 'ఇట్టు శ్రావణీ సుబ్రమణ్యం', 'ఇడియట్', 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి', 'శివమణి' వంటి హిట్లు కొట్టేశాడు.

మహేశ్‌తో ఇండస్ట్రీ హిట్.. నిరాశతోనే

మహేశ్‌తో ఇండస్ట్రీ హిట్.. నిరాశతోనే

హిట్లు ఫ్లాపులతో కెరీర్‌ను సాఫీగా సాగిస్తోన్న తరుణంలో పూరీ జగన్నాథ్.. మహేశ్ బాబుతో 'పోకిరి' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో పూరీ రేంజ్‌ దేశ వ్యాప్తంగా తెలిసిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దీని తర్వాత కొన్ని సినిమాలు పరాజయం పాలవడం ఆయనను ఎంతో నిరాశకు గురి చేసింది.

వరుసగా 15 సినిమాల వరకూ దెబ్బే

వరుసగా 15 సినిమాల వరకూ దెబ్బే

కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న పూరీ జగన్నాథ్‌కు 'దేశముదురు' తర్వాత అంతగా కాలం కలిసి రాలేదు. ఈ క్రమంలోనే ఆయన ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్టార్లు, చిన్న హీరోలతో కలిసి ఏకంగా 15 సినిమాల వరకూ చేస్తూ వచ్చినా సక్సెస్‌ మాత్రం దక్కలేదు. దీంతో ఈ డైనమిక్ దర్శకుడి పనైపోయిందని చాలా మంది కామెంట్లు కూడా చేశారు.

‘టెంపర్' చూపించిన పూరీ జగన్

‘టెంపర్' చూపించిన పూరీ జగన్

వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సమయంలో పూరీ జగన్నాథ్.. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి 'టెంపర్' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో అటు ఎన్టీఆర్.. ఇటు పూరీ ఇద్దరూ మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇక, ఈ చిత్రంతో ఈ దర్శకుడు విమర్శకుల నోళ్లు మూయించి ఎన్నో రికార్డులు కొట్టేశాడు.

మళ్లీ అదే తీరు.. ఇస్మార్ట్‌గా కొట్టేశాడు

మళ్లీ అదే తీరు.. ఇస్మార్ట్‌గా కొట్టేశాడు

'టెంపర్'తో మాంచి సక్సెస్‌ను అందుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు ఆ తర్వాత మళ్లీ వరుసగా పలు పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ఈ డైరెక్టర్‌ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమా చేశాడు. పక్కా మాస్ మసాలా కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు

పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు

'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ ట్రాక్ ఎక్కిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే సినిమాను చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. పూరీ, చార్మీలతో కలిసి కరణ్ జోహార్ దీన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు.

Recommended Video

Heroine Shwetta Parashar About 'Alanti Sitralu' Movie
85 కోట్లకు మోసం.. మళ్లీ సంపాదించి

85 కోట్లకు మోసం.. మళ్లీ సంపాదించి

పూరీ జగన్నాథ్ డబ్బు లెక్కచేయని తత్వం వల్ల మోసానికి గురయ్యాడు. బాగా నమ్మిన వాళ్లే ఆయనకు రూ. 85 కోట్లు నష్టం చేకూర్చారు. దీంతో అతడు మళ్లీ జీరో నుంచి మొదలయ్యాడు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ రోడ్డున పడే పరిస్థితి నుంచి మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు.

తద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. అందుకే అతడు టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు.డైనమిక్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోన్న పూరీ జగన్నాథ్ మరిన్ని పుట్టినరోజులు సక్సెస్‌ఫుల్‌గా జరుపుకోవాలని కోరుకుంటూ ఫిల్మీ బీట్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X