For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్మోకింగ్ ఇష్యూ.. స్పందించిన రామ్.. తనదైన స్టైల్‌లో కౌంటర్

    |
    Ram Pothineni Strong Counter On Smoking Issue At Charminar || Filmibeat Telugu

    ఎనర్జిక్ స్టార్ రామ్ పబ్లిక్ ప్లేస్‌లో సిగరెట్ తాగుతూ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వచ్చాయి. షూటింగ్ బ్రేక్ సమయంలో రామ్ సిగరెట్ అంటించాడని కొందరు పేర్కొనగా, లేదు లేదు షూటింగ్‌లో భాగంగానే రామ్ సిగరెట్ వెలిగించాల్సి వచ్చిందని మరికొందరు పేర్కొన్నారు. అలాగే రామ్ సిగరెట్ తాగుతూ కనిపించిన ఆ ఫొటోను షేర్ చేస్తూ ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్లు కూడా చేశారు. దీంతో తాజాగా ఈ అంశంపై స్పందించారు హీరో రామ్.

    చార్మినార్ ఏరియాలో.. అదీ పబ్లిక్ ప్లేస్‌లో

    చార్మినార్ ఏరియాలో.. అదీ పబ్లిక్ ప్లేస్‌లో

    చార్మినార్ ఏరియాలో గల పబ్లిక్ ప్లేస్‌లో రామ్ సిగరెట్ అంటించడం.. దానికి పోలీసులు 200 రూపాయల ఫైన్ విధించడం జరిగింది. సెలెబ్రిటీ అయినా, సాధారణ పౌరుడికి ఉండే చట్టాలే ఉంటాయని నిరూపిస్తూ పోలీసులు చేసిన ఈ పని పట్ల జనం హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇంతకీ హీరో రామ్ ఆ నో స్మోకింగ్ జోన్‌లో సిగరెట్ ఎందుకు తాగాడనే విషయమై చర్చలు మొదలయ్యాయి.

    ఇదీ జరిగింది.. రామ్ క్లారిటీ

    ఇదీ జరిగింది.. రామ్ క్లారిటీ

    అసలు చార్మినార్ ఏరియాలో అలా సిగరెట్ ఎందుకు తాగాల్సి వచ్చిందనే దానిపై తాజాగా సోషల్ మీడియా వేదికగా రామ్ స్పందించాడు. ''షాట్‌ల కాల్చిన తమ్మీ.. బ్రేక్‌ల కాదు.. టైటిల్ సాంగ్‌లో చూస్తావ్‌గా స్టెప్పు'' అని పేర్కొన్నాడు రామ్. అంటే ఆయన తాగిన ఆ సిగరెట్ షూట్‌లో భాగంగానే తప్ప పర్సనల్ కాదని క్లారిటీగా చెప్పేశాడు రామ్.

    చట్టాన్ని గౌరవించే అలా చేశాం

    షూట్‌లో భాగంగా అయితే ఫైన్ ఎందుకు కట్టారని డౌట్ రావచ్చు. అది సినిమా షూటింగ్ అయినా ఒకవేళ నో స్మోకింగ్ జోన్‌లో స్మోకింగ్ చేయాల్సి వస్తే.. పోలీసుల అనుమతి తీసుకోవాలి. కానీ తీసుకోలేదు కాబట్టి ఫైన్ కట్టారు. ఈ విషయాన్ని కూడా పేర్కొంటూ చట్టాన్ని గౌరవించే ఫైన్ కట్టామని అన్నారు రామ్. ఈ మేరకు 'లైట్ తీస్కో పని చూస్కో' తనదైన స్టైల్‌లో కామెంట్ చేశాడు ఈ ఎనర్జిటిక్ స్టార్.

     ఇస్మార్ట్ శంకర్ మూవీ

    ఇస్మార్ట్ శంకర్ మూవీ

    రామ్ పోతినేని హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'ఇస్మార్ట్ శంకర్' మూవీ. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై ఛార్మి, పూరిజగన్నాథ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జులై 18 వ తేదీన 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

    English summary
    Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's high voltege action seens will seen in this movie. Now from this movie shooting is going on in hyderabad. In this shooting Ram punished with fine by police. In this issue Ram giving clarity on that
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X