విజయ్ దేవరకొండ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్.. లైగర్ కోసం జాకీచాన్ టీమ్
ప్రముఖ నిర్మాణ సంస్థలు పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం లైగర్. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే పలు సంచలన విషయాలకు వేదికగా నిలుస్తున్నది. తాజాగా ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌ను ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్‌తోపాటు కరణ్ జోహర్, చార్మీ, తదితరులు ట్వీట్ చేశారు. ట్వీట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

జాకీచాన్ సినిమాలకు పనిచేసిన అండీ లాంగ్
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ ట్వీట్ చేస్తూ.. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆండీ లాంగ్, ఆయన టీమ్‌ను లైగర్ సినిమా కోసం ఎంపిక చేశామని చెప్పడానికి థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాం. గతంలో జాకీ చాన్ లాంటి ప్రముఖ నటులకు ఆయన స్టంట్ కొరియోగ్రఫి చేశారు. లైగర్ లాంటి యాక్షన్ సినిమాకు ఆయన పనిచేయడం గర్వంగా భావిస్తున్నాం అని పేర్కొన్నారు. ట్వీట్‌తోపాటు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి దిగిన ఫోటోను ఆయన షేర్ చేశారు.

అండీ లాంగ్ హాలీవుడ్ కెరీర్
ఇక హాలీవుడ్‌లో టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన అండీ లాంగ్ అసలు పేరు ఆండ్రియాస్ నుయెన్. జాకీ ఛాన్ నటించిన ఆర్మూర్ ఆఫ్ గాడ్ 3, చైనీస్ జోడాయిక్, పోలీస్ స్టోరీ 2013, డ్రాగన్ బ్లేడ్ చిత్రాల్లో నటించారు. 2006లో మ్యాగ్ ఫైటర్స్ అనే స్టంట్ టీమ్‌ను ప్రారంభించారు.

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీలో
ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేసి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్నది.

లైగర్ చిత్రానికి పనిచేసే యూనిట్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ, అనన్య పాండే, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలీ, మక్రంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు
డైరెక్టర్: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: కరణ్ జోహర్, చార్మీ కౌర్, అపూర్వ మెహతా, హీరూ యష్ జోహర్, పూరీ జగన్నాథ్
డీవోపీ: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్: అండీ లాంగ్


Click it and Unblock the Notifications











