ఆ విషయంలో పూరి జగన్నాథ్ భారీగా ఖర్చు.. అంతా లైగర్ కోసమే..
టాలీవుడ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో లైగర్ ఒకటి. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రౌడి స్టార్ విజయ్ దేవరకొండ నెవర్ బిఫోర్ అనేలా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ కి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. సినిమా కచ్చితంగా ఎదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందని కామెంట్స్ అయితే వస్తున్నాయి.
అసలు మ్యాటట్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో పూరి జగన్నాథ్ ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదట. పూరితో పాటు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా కోసం నాలుగు రకాల భారీ సెట్స్ ను రెడీ చేస్తున్నారట. పూరి జగన్నాథ్ తన కెరీర్ లో సెట్స్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేయలేదట.

మొదటిసారి లైగర్ కోసం భారీగా ఖర్చు పెట్టిస్తున్నట్లు సమాచారం. ఇక కరణ్ జోహార్ కూడా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాలని సలహాలు ఇస్తున్నారట. బాహుబలి అనంతరం కరణ్ జోహార్ బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్న టాలీవుడ్ సినిమా ఇదే కావడం విశేషం. కరణ్ నమ్మితే సినిమాలో ఏదో బలమైన కంటెంట్ ఉంటుందని ఒక టాక్ అయితే ఉంది. మరి లైగర్ సినిమా నార్త్ ఆడియెన్స్ ను ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











