‘ఇద్దరమ్మాయిలతో’ షో... సూపర్ అంటూ చిరు చప్పట్లు!
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం శుక్రవారం(మే 31)న గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్‌లతో పాటు పలువురు ముఖ్యమైన వ్యక్తుల కోసం ప్రత్యేకంగా షో వేసారు.
మెగా కుటుంబ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం....సినిమా చూసిన రామ్ చరణ్, వరుణ్ తేజ్ సినిమా చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే విధంగా ఈ సినిమాలోని ఇంటర్వెల్ ఫైట్ అద్భుతంగా ఉందని, సినిమాకు ఇది హైలెట్‌గా చెబుతున్నారు. చిరంజీవి ఈ ఫైట్ సీన్ చూస్తున్నంత సేపు చాలా బాగుంది అంటూ చప్పట్లు కొడుతూనే ఉన్నారట. అదే విధంగా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, డాన్స్‌లను చిరంజీవి ప్రశంసించినట్లు తెలిసింది.

ఇప్పటికే దర్శకుడు పూరి సినిమా చాలా బాగుందని చెప్పడంతో పాటు....ఇటు హీరో అల్లు అర్జున్, అటు నిర్మాత బండ్ల గణేష్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. వీరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రేక్షకదేవుడు ఇచ్చే తీర్పుపైనే ఈ సినిమా భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పక తప్పదు. మరి ఏం జరుగబోతోందో చూడాలి.
అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈచిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మించారు. ఓవర్సీస్‌లో ప్రీమియర్‌షోలతో మే 30న విడుదలవుతుండగా, ఇండియాలో మాత్రం మే 31న విడుదలవుతోంది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











