వ్యాంపులు చాలానే వస్తాయి.. ఛార్మీని బండ్ల గణేష్ టార్గెట్ చేసింది అందుకేనా?
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వేదిక ఏదైనా.. సందర్భం ఏదైనా తనదైన శైలిలో చేసే వ్యాఖ్యలు సంచలనంగా వైరల్‌గా మారుతాయి. గతంలో ఎన్నో వేదికలపై ట్రెండింగ్ ఉపన్యాసాలు ఇచ్చిన బండ్ల గణేష్... చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్ అయ్యాయి. అయితే నటి, నిర్మాత చార్మీ కౌర్‌ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్పీచ్‌పై రకరకాల ఊహాగానాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారంటూ
గత కొద్దికాలంగా ఛార్మీ, పూరీ జగన్నాథ్ సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే వారిద్దరూ ఎక్కువగా ముంబైలోనే కాలం గడుపుతున్నారు. లైగర్, జనగణమన షూటింగ్స్ ముంబైలోనే జరగడంతో హైదరాబాద్ రావడం తగ్గిందనే విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

భార్యకు పూరీ డైవోర్స్ అంటూ
ఇటీవల పూరీ జగన్నాథ్, ఆయన భార్య లావణ్యకు డైవోర్స్ ఇచ్చారనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే విడాకుల వార్తపై వివరణ ఇస్తూ ఆకాశ్ పూరీ క్లారిటీ ఇవ్వడంతో కొంత తీవ్రత తగ్గుముఖం పట్టిం ది. అయితే ఈ వార్త ఇంకా సద్దుమణగకముందే చార్మీని ఉద్దేశించి పరోక్షంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

సీతాదేవికి ఉన్న ఓపిక లావణ్యకు అంటూ
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. చోర్ బజార్ సినిమా ఫంక్షన్‌కు వచ్చింది వదిన లావణ్య కోసం. ఓ స్త్రీ జాతి గర్వపడే మాతృమూర్తి ఎలా ఉండాలంటే అది లావణ్య మాదిరిగా ఉండాలి. ఓ అమ్మ, ఓ అక్క, ఓ వదిన, ఓ భార్య, ఓ కోడలు, ఓ కూతురు ఎలా ఉండాలంటే.. లావణ్య మాదిరిగా ఉండాలి. నేను సీతాదేవిని చూడలేదు కానీ.. ఆమెకు ఉన్న ఓపిక లావణ్య గారికి ఉంది. కర్ణుడిని కన్న గొప్ప కుంతికి ఉన్న క్వాలిటీస్ లావణ్యలో ఉన్నాయి అంటూ పూరీ జగన్నాథ్ సతీమణిపై బండ్ల గణేష్ ప్రశంసల వర్షం కురిపించారు.

పూరీ మహోన్నతమైన వ్యక్తి
,
పూరీ జగన్నాథ్ అన్నతో రెండు సినిమాలు జర్నీ చేశాను. పూరీ గొప్ప, మహోన్నతమైన వ్యక్తి, ర్యాంపులు, వ్యాంపులు చాలా వస్తాయి. జీవితాంతం తోడుడేది అమ్మ, భార్య. అలాంటి అమ్మను గుండెలో పెట్టుకొని ఆకాశ్ చూడాలి అంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

బండ్ల గణేష్ స్చీచ్‌కు..
ఆకాశ్ నటించిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పూరీ జగన్నాథ్ రాకపోవడంపై బండ్ల గణేస్ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కాడు. అయితే బండ్ల గణేష్ మాట్లాడినంత సేపు పూరీ కుటుంబం చప్పట్లు కొడుతూ నవ్వడం చూస్తే.. పూరీపై వారికి కూడా అంతో ఇంతో కోపం ఉందనే విషయం చెప్పకనే చెప్పినట్టు అయింది. అయితే బండ్ల గణేష్ వ్యాఖ్యలపై పూరీ, చార్మి స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











