అర్జున్‌రెడ్డిని మించి.. విజయ్ దేవరకొండతో జాహ్నవి.. ఆ టాప్ డైరెక్టర్‌తో
టాలీవుడ్‌లో సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఎవడే సుబ్రమణ్యం, పెళ్లిచూపులు సినిమాతో మొదలైన కెరీర్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో ఊపందుకొన్నది. వరుస సినిమాలు విజయాలు సాధించడంతో మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రం మిశ్రమ ఫలితాన్ని అందుకోగా.. ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఓ మాస్ ఎంటర్‌టైనర్ ఫైటర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా గురించి పలు విషయాలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ విషయాలు ఏమిటంటే..

మరో రేంజ్‌లో విజయ్ దేవరకొండ
ఫైటర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఓ డిఫరెంట్ లుక్‌తో కనిపించబోతున్నాడని పూరీ ఇటీవల మీకు మాత్రమే చెప్తా చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో వెల్లడించారు. విజయ్ రోల్ మరో రేంజ్‌లో ఉంటుంది. అర్జున్ రెడ్డిని మించి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అని పూరీ పేర్కొన్నారు. దాంతో ఫైటర్ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. తన రోల్‌కు తగినట్టుగా విజయ్ దేవరకొండ సంసిద్ధమవుతున్నట్టు సమాచారం.

సిక్స్‌ప్యాక్‌తో క్రేజీగా
ఫైటర్‌లో రోల్ డిమాండ్ చేయడంతో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ బాడీ కోసం కసరత్తులు మొదలుపెట్టారట. తాను ఈ సినిమా కోసం ఎక్కువ మోతాదులో కష్టపడుతున్నాను. అంతేకాకుండా బరువు పెరిగేందుకు పుష్టిగా ఆహారం తీసుకొంటున్నాను అని ఇటీవల విజయ్ దేవరకొండ మీడియాతో అన్నారు. అంతేకాకుండా బాక్సింగ్‌ను కూడా నేర్చుకొంటున్నట్టు తెలుస్తున్నది.

ఫార్మూలాను మార్చేసిన VD
గత మూడు నాలుగు సినిమాలు కంటెంట్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచాయి. ఇక తన ఇమేజ్ అలాంటి కథలు పట్టవని కొత్తగా ఫార్మూలాను మార్చేస్తున్నాడు. అంతేకాకుండా కొత్త డైరెక్టర్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ.. టాప్ డైరెక్టర్లతో జత కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ క్రమంలోనే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఊపేస్తున్న పూరీతో చేతులు కలిపి ఫైటర్‌గా రాబోతున్నాడు.
Recommended Video

హీరోయిన్‌గా జాహ్నవి కపూర్
ఇక ఫైటర్‌లో బాలీవుడ్ తార, దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవిని హీరోయిన్‌గా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధడక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి తన తల్లి కోరికను తీర్చడానికి దక్షిణాది సినిమాలపై కన్నేసినట్టు తెలిసింది. అయితే సరైన కథ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఫైటర్ సినిమా కథలోని పాత్ర నచ్చినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కరణ్ జోహర్‌తో కూడా ఫైటర్ యూనిట్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











