Who is Mahira Sharma? యంగ్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో క్రికెటర్ సిరాజ్..ఎవరీ మహిరా శర్మ?

Mahira Sharma- Mohammed Siraj: ఇండియాలో సినిమా,క్రికెట్ లకు మధ్య స్ట్రాంగ్, ఎమోషనల్ బాండ్ ఉందనే చెప్పాలి. క్రికెటర్లంటే సినిమా వాళ్లకు, సినిమా వాళ్లంటే క్రికెటర్స్ కు క్రేజ్. ఈ రెండు రంగాలలో ఉన్నవారు ఎంత ఫేమస్ అయినప్పటికీ వారి ప్రైవేట్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది. కనుక వీరు ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా ఇట్టే వైరలవుతోంది. మరుక్షణంలో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అలా తాజాగా టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హమ్మద్ సిరాజ్ బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇంతకీ మహిరా శర్మ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?

గతవారం రోజులుగా టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హమ్మద్ సిరాజ్ సోషల్ మీడియాలో వైరలవుతున్నారు. ఇటీవలే లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో సిరాజ్ ప్రేమాయణం కొనసాగిస్తున్నారని వార్తలు విన్పించాయి. దీంతో ఆ పుకార్లును వారిద్దరూ కొట్టిపారేశారు. జనై తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరాజ్‌ను "మేరే ప్యారే భాయ్" (నా ప్రియమైన సోదరుడు) అని పిలుస్తూ, సిరాజ్ ఆమెను "బెహ్నా" (సోదరి) అని సంబోధించి పుకార్లకు చెక్ పెట్టారు. దీంతో వారి రిలేషన్ పై పుల్ క్లారిటీ వచ్చింది. వార్తలకు తెరపడింది.

Is Mohammed Siraj dating with Mahira Sharma Who is Mahira Sharma

కానీ, తాజాగా మ‌హమ్మద్ సిరాజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు మరోసారి వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని సిరాజ్, మహిరా సన్నిహితులు ధ్రువీకరించినట్లు గానీ, వీరిద్దరూ ఇప్పటివరకు మీడియా కంటబడింది లేదు. కానీ, వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేయడం, ఒకరి ఫోటోలను మరొకరూ ఫోటోస్ ను లైక్‌లు, కామెంట్స్ చేసుకున్నారు.

దీంతో సిరాజ్- మహిరా శర్మ మధ్య ప్రేమాయణం సాగుతోందని రూమర్స్ స్టార్ అయ్యాయి. వీరిద్దరూ వ్యక్తిగతంగా చాలా సైలెంట్ గా ఉన్నా.. గతేడాది నవంబర్‌ నుంచి డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది సోషల్ మీడియాలో . ఈ జంట తమ సంబంధాన్ని బహిరంగంగా ధృవీకరించినప్పటికీ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా సిరాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవ్వడం ఇదేమి తొలిసారి కాదు.

Is Mohammed Siraj dating with Mahira Sharma Who is Mahira Sharma

ఇంతకీ మహిరా శర్మ ఎవరు? మ‌హిరా శ‌ర్మ‌.. ప్రముఖ నటి, ముఖ్యంగా ఈ అమ్మడు హిందీ, పంజాబీ టెలివిజన్ షోలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. జమ్మూ నుంచి ఇండస్ట్రీ లో అడుగుపెట్టి న ఈ ముద్దుగు్మ చిన్న వయసులోనే తన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది. యారోన్ కా తషాన్ (2017) అనే సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. తరువాత నాగిన్ (2018), బెపనా ప్యార్ (2019), కుండలి భాగ్య (2019) వంటి పలు సీరియల్స్ లో నటించి, మెప్పించింది.

డైరెక్ట్ గా నన్ను ఒక రాత్రికి రమ్మన్నాడు.. ప్రముఖ డైరెక్టర్ పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
అలాగే.. ప‌లు మ్యూజిక్ వీడియోలలో కూడా ఆమె క‌న్పించింది. 2023 లో లెహ్ంబర్ గిన్ని అనే ( పంజాబీ) సినిమాలో నటించి,మరింత పాపులర్టీ సంపాదించుకుంది. అలాగే.. బిగ్ బాస్ 13లో పాల్గొన్న తర్వాత ఆమె మరింత ఫేమస్ అయ్యింది. ఈ షోలో తన తోటి కంటెస్టెంట్ పరాస్ ఛబ్రాతో ఆమె లవ్ సోర్టీ కొనసాగించింది. అయితే, సిరాజ్‌తో మహీరా శర్మ డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె తల్లి సానియా స్పందించింది. అలాంటిదేమీ లేదు. జనాలు ఏదైనా అంటారు. నా కూతురు ఇప్పుడు సెలబ్రిటీ. కాబట్టి నెటిజన్లు తమకు ఇష్టవచ్చింది మాట్లాడుతారంటూ మండిపడింది.

More from Filmibeat

Read more about: mohammed siraj mahira sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X