SS Rajamouli: రాజమౌళి క్షుద్రపూజలు? మంత్ర విద్యలతో వినాయక్, పూరి, ఆర్జీవీని నాశనం చేశాడా?
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై ఆయన స్నేహితుడు, సినీ ప్రముఖుడు, యమదొంగ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తనను మానసికంగా వేధించారు. ఆ కారణంగానే తాను మరణించాలని నిర్ణయించుకొన్నాను. తన మరణానికి ముందు సూసైడ్ లెటర్, సెల్పీ వీడియోను పోస్టు చేస్తున్నాను. ఇది పబ్లిసిటీ కోసం కాదు. వాస్తవాలు ప్రపంచానికి తెలియజేయడమే నా ఉద్దేశం అంటూ ఆయన నాలుగు పేజీల లేఖను పోలీసులకు పంపారు. ఈ సూసైడ్ లెటర్ వివరాల్లోకి వెళితే..
రాజమౌళిది నాది 30 ఏళ్ల స్నేహ బంధం. మా స్నేహం మధ్య ఒక మహిళ చిచ్చు పెట్టింది. ఆ మహిళతో నేను ప్రేమలో ఉన్నాను. ఆ తర్వాత ఆ మహిళను రాజమౌళి వివాహం చేసుకొన్నారు. ఆ కారణంగా నేను కొన్ని విషయాలను త్యాగం చేశాను. అప్పటి నుంచి నా 54 సంవత్సరాల జీవితంలో నేను బ్రహ్మచారిగానే మిగిలిపోయాను అని శ్రీనివాసరావు 1234 లేఖలో పేర్కొన్నారు.

శాంతి నివాసం సీరియల్‌కు ముందు ఈ విషయాలన్నీ మా జీవితంలో చోటు చేసుకొన్నాయి. రాజమౌళి కోసం నేను నా ప్రేమను త్యాగం చేశాను. ఈ విషయాలన్నీ తెలియాలంటే వారిద్దరికి లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలి. అప్పుడే వాస్తవాలు ఏమిటో ప్రపంచానికి తెలుస్తాయి. నా సూసైడ్‌కు ముందు ఈ విషయాలన్ని లేఖ ద్వారా వెల్లడించాలని కోరుకొంటున్నాను అని ఆయన అన్నారు.
రాజమౌళి క్షుద్ర విద్యలు చేర్చుకొన్నారు. ఆయన వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్, గుణశేఖర్, రాంగోపాల్ వర్మ, వైవీఎస్ చౌదరీ, సురేందర్ రెడ్డి, శంకర్‌పై మంత్ర విద్యలు ప్రదర్శించారు. దాంతొ వారి కెరీర్‌ను నాశనం చేశాడు. ఇప్పుడు సుకుమార్, అనిల్ రావిపూడిపై కూడా క్షుద్ర విద్యలు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు.

రాజమౌళి సిక్త్ సెన్స్ అనే సినిమాలో మాదిరిగా క్షుద్ర పూజలు చేస్తారు. ఎవరు కూడా గుర్తు పట్టని విధంగా ఆయన మంత్ర విద్యలు చేస్తారు. ఈ విషయాలు బయటకు రావాలంటే ఆయనకు లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలి. అప్పుడే అన్ని విషయాలు బయటకు వస్తాయి. దయచేసి పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి అని ఆయన రిక్వెస్ట్ చేశారు.
అయితే సెల్పీ వీడియో, నాలుగు పేజీల సూసైడ్ లెటర్ తర్వాత యూ శ్రీనివాసరావు కనిపించకుండా పోయారు. ఆయన సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఆయన బతికే ఉన్నాడా? లేదా? చనిపోయాడా? అనే అనుమానాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఆయన చేసిన ఆరోపణలు కూడా సత్యదూరంగా ఉన్నాయి. ఆయన మానసిక వ్యాధితో ఏమైనా బాధపడుతున్నారా? అనే అనుమానం కూడా వస్తున్నది.


Click it and Unblock the Notifications











