నా బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా: అన్నపై ఎన్టీఆర్ ఫన్నీ కామెంట్ (ఇజం ఆడియో విశేషాలు)

By Bojja Kumar

హైదరాబాద్: నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'.

ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సినిమా బిగ్ సీడీని నంద‌మూరి హ‌రికృష్ణ విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ ఆడియో సీడీల‌ను అందుకున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. యూ ట్యూబ్‌లో టీజర్‌కు, ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి. కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే మోస్ట్‌ పవర్‌ఫుల్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ డిఫరెంట్‌ లుక్‌తో కనిపించబోతున్నారు.

అనూప్ గురించి ఎన్టీఆర్

అనూప్ గురించి ఎన్టీఆర్

టెంపర్ జరుగుతున్నపుడే అనూప్ గురించి పూరిగారితో మాట్లాడాను. అతడు ఈ జనరేషన్ కు తగిన విధంగా మంచి మెలోడీ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆయన చేసిన మనం కానివ్వండి, ఈ రోజు ఇజం పాటలు కానివ్వండి అతడు కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్స్ బాగా నచ్చాయి. ఈ సినిమాకు మంచి పాటలు అందించిన అనూప్ కు థాంక్స్ అన్నారు ఎన్టీఆర్.

పూరి నేను భయ్యా భయ్యా అని పిలుచుకుంటాం: ఎన్టీఆర్

పూరి నేను భయ్యా భయ్యా అని పిలుచుకుంటాం: ఎన్టీఆర్

నేను పూరి గారు భయ్యా భయ్యా అని పిలుచుకుంటాం. టెంపర్ సినిమా సమయంలోనే పూరి గారు కళ్యాణ్ అన్నతో సినిమా చేయాలనే డిస్ర్కషన్స్ లో ఉన్నాడు. ఓసారి ఆయనే వచ్చి కళ్యాణ్ అన్నతో సినిమా అనుకుంటున్నామని చెప్పారు. నేను వెంటనే ఏ కథ భయ్యా అని అడిగాను. నాకు ఆల్మోస్ట్ జగన్ గారి కథలు అన్నీ తెలుసు. అది గుర్తుంది కదా ఆ కథ ‘ఇజం' అని చెప్పారు అని తెలిపారు.

అన్నకు నేనే ఆ న్యూస్ చెప్పా

అన్నకు నేనే ఆ న్యూస్ చెప్పా

పూరి భయ్యా ఆ విషయం చెప్పగానే అన్నకు ఫోన్ చేసి జగన్ గారితో మన సినిమా కన్ ఫర్మ్ అయిపోయింది అని న్యూస్ చెప్పింది నేనే అన్నారు ఎన్టీఆర్. వెంటనే మైక్ అందుకున్న కళ్యాణ్ రామ్... తమ్ముడు నాకు ఆ న్యూస్ ఫిబ్రవరి 4 వ తేదీ పదకొండున్నరకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ విషయం నేను ఎప్పటికీ మరిచిపోను అన్నారు.

పూరి వల్లే నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది

పూరి వల్లే నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది

జగన్ గారు నాకు ఇష్టం ఎందుకంటే ఆయన సక్సెస్ రేటు గానీ, ఆయన చేసినటువంటి సక్సెస్ ఫుల్ సినిమాలు అన్నీ పక్కన పెడితే... నేను జగన్ గారితో పని చేసిన అనుభూతి చెబుతున్నాను. జగన్ గారితో టెంపర్ చేయక ముందు నేనొకటి, ఆయనతో టెంపర్ చేసిన తర్వాత ఒకటి. ఈ రోజు నాలో ఇంత కాన్ఫిడెన్స్ పెరిగిందంటే, నటుడిగా ఏదైనా సాధించాలనే తపన పెరిగిందంటే కేవలం టెంపర్ వల్లనే. అంతా ఆయన ఇచ్చిందే అన్నారు ఎన్టీఆర్.

అన్నయ్య కొత్తగా కనిపిస్తారు అనే స్వార్థం ఉంది

అన్నయ్య కొత్తగా కనిపిస్తారు అనే స్వార్థం ఉంది

జగన్ గారితో పని చేస్తే అన్నయ్య ఒక కొత్త కోణం నేర్చుకుంటారు, ఆయనకంటూ ఒక కొత్త కోణం తెలుస్తుంది. ఆడియన్స్ ముందు కొత్తగా కనిపిస్తారు అనే స్వార్థం ఉంది. నేను అనుకున్న మాట నిజం అని మీకు అందరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. నేనెప్పుడూ కళ్యాణ్ అన్నని అలా చూస్తానని అనుకోలేదు. థాంక్స్ ఎలాట్ భయ్యా(పూరిని ఉద్దేశించి) అన్నయ్యని లుక్స్ పరంగా ఇంత అమేజింగ్ గా తయారు చేసినందుకు.. నేను మాట్లాడేది ఆయన బాడీ గురించి, ఆయన లుక్ గురించి కాదు, ఆయనలో ఉండే ఆటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్నేళ్లు కలిసి పెరిగిన నేను చూడలేదు ఆయనలో ఇలాంటి కోణం ఉందని, ఇదంతా మీ వల్లే భయ్యా... థాంక్స్ ఎలాట్ అని పూరిపై ప్రశంసలు గుప్పించారు ఎన్టీఆర్.

అన్నయ్య నాకు మంచి గర్ల్ ప్రెండ్ కూడా

అన్నయ్య నాకు మంచి గర్ల్ ప్రెండ్ కూడా

అన్నయ్య నాకు మంచి గర్ల్ ప్రెండ్ కూడా... అంటూ ఎన్టీఆర్ చేసిన ఫన్నీ కామెంట్స్ కోసం క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X