బీరుతో వర్మ రచ్చ.. ఇద్దరు హీరోయిన్లపై పోసి.. పిచ్చోడిని చేసిందంటూ ట్వీట్

Recommended Video

RGV Mad Celebrations With Ismart Shankar Team || Filmibeat Telugu

ఎన్నో సంవత్సరాలుగా హిట్ లేని డైరెక్టర్.. సినిమాలు పర్వాలేదనిపించినా.. భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో.. ఇద్దరూ కలిసి సినిమా తీస్తే.. అది కూడా పక్కా మాస్ వసాలా అయితే.. ఆ సినిమా 'ఇస్మార్ట్ శంకర్' అవుతుంది. పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బీసీ సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీంతో అటు పూరీ అభిమానులు, ఇటు రామ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను రాబట్టడంలో ఈ సినిమా కొంత సక్సెస్ కాలేదన్న టాక్ వినిపిస్తోంది.

సినిమాకు వర్మ

ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ‘‘హేయ్ పూరీ జగన్నాథ్ అండ్ ఛార్మీ కౌర్.. నా అసిస్టెంట్స్ ఆర్‌ఎక్స్‌ 100 ఫేం అజయ్‌ భూపతి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ఫేం అగస్త్య మంజులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల ఆట చూడటానికి ముసాపేట శ్రీరాములు థియేటర్‌కు వెళ్తున్నా. ముగ్గురం బైక్‌పై వెళ్తున్నాం. అది కూడా మాంచి మాస్ గెటప్పులలో వెళ్తున్నాం'' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

పార్టీ చేసుకుందాం అంటూ..

పార్టీ చేసుకుందాం అంటూ..

ఇదే కాదు.. సినిమా విడుదలైన తర్వాత కూడా వర్మ.. దీనిపై స్పందించారు. అప్పటి నుంచి తరచూ ట్వీట్లు చేస్తున్నారు. ‘‘హేయ్ ఛార్మీ కౌర్.. మీ సినిమా టీమ్‌తో కలిసి పార్టీ చేసుకోడానికి వస్తున్నాను'' అని మొన్న ట్వీట్ చేశాడు. ఇందులో భాగంగానే శనివారం ఆయన సినిమా చూడడానికి వెళ్లారు. సినిమా చూడడానికి వస్తున్నా అని చెప్పగానే చిత్ర యూనిట్ కూడా అక్కడకు చేరుకుంది. ఈ క్రమంలోనే అక్కడ చిత్ర యూనిట్‌తో వర్మ పార్టీ చేసుకున్నారు.

బీరుతో రచ్చ

ఈ సందర్భంగా వర్మ బీరు బాటిల్‌తో రచ్చ రచ్చ చేశాడు. బీరును పొంగించి, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, హీరోయిన్స్ నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ సహా చిత్ర యూనిట్‌పై పోశారు. అంతేకాదు, చివర్లో తాను కూడా మిగిలిన బీర్ మొత్తానికి పోసుకున్నాడు. దీనికి సంబంధించిన పలు వీడియోలను ట్వీట్ చేస్తూ.. ‘‘నేను పిచ్చోడిని కాదు.. ఇస్మార్ట్ శంకర్ నన్ను పిచ్చోడిని చేసింది. కాబట్టి మీరు పూరీని, ఛార్మీనే నిందించాలి'' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో ఉంది.

‘ఇస్మార్ట్ శంకర్’ గురించి

‘ఇస్మార్ట్ శంకర్’ గురించి

విజయం కోసం పరితపిస్తున్న పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్'. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X