పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఛార్మి!

ఒకప్పుడు పైరసీ రూపంలో సినిమాలకు తీవ్ర నష్టం జరిగేది. అయితే ఈ మధ్య కాలంలో రిలీజ్ కాకముందే ఎడిటింగ్ రూము నుంచే లీక్ అవుతున్న ఘటనలు నిర్మాతలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలకు, విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ స్టార్ల సినిమాలకు గతంలో ఇలాంటి సమస్య ఎదురైన సంగతి తెలిసిందే.

ఇపుడు రామ్ హీరోగా నటిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి ఇలాంటి కష్టమే వచ్చిపడింది. 'ఇస్మార్ట్ శంక‌ర్‌' స్క్రిప్టు లీక్ అవ్వడంతో నిర్మాతల్లో ఒకరైన ఛార్మి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

బజ్ బాస్కెట్ ఇన్‌స్టా‌గ్రామ్ గ్రూప్‌లో స్క్రిప్ట్ లీక్

బజ్ బాస్కెట్ ఇన్‌స్టా‌గ్రామ్ గ్రూప్‌లో స్క్రిప్ట్ లీక్

బజ్ బాస్కెట్ అనే ఇన్‌స్టా‌గ్రామ్ గ్రూప్‌లో స్క్రిప్ట్ లీకైన విషయం తమ దృష్టికి రావడంతో ‘ఇస్మార్ట్ శంకర్' నిర్మాతలు అలర్ట్ అయ్యారు. ఈ విషయమై ఛార్మి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. స్క్రిప్టు లీకేజీ యూనిట్ సభ్యుల్లో ఎవరో ఒకరు చేసినట్లు అనుమానిస్తున్నారు.

డబ్బు డిమాండ్ చేస్తున్న అడ్మిన్

డబ్బు డిమాండ్ చేస్తున్న అడ్మిన్

స్క్రిప్టు లీక్ విషయంలో గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న మురళీకృష్ణను 'ఇస్మార్ట్ శంకర్' చిత్రయూనిట్ కాంటాక్ట్ చేయగా డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. డబ్బు ఇవ్వకపోతే అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో సినిమా స్క్రిప్టు లీక్ చేస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.

మురళీకృష్ణపై ఫిర్యాదు చేసిన ఛార్మి

మురళీకృష్ణపై ఫిర్యాదు చేసిన ఛార్మి

తమ సినిమా స్క్రిప్ట్ లీక్ చేసిన బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళీకృష్ణపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఛార్మి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో స్క్రిప్ట్ లీక్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

డబ్బు డిమాండ్ చేయలేదంటున్న మురళీ కృష్ణ

డబ్బు డిమాండ్ చేయలేదంటున్న మురళీ కృష్ణ

బజ్ బాస్కెట్ గ్రూపు అడ్మిన్ మురళీ కృష్ణ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ... ఓ తెలుగు వెబ్ సైట్ నుంచి తాను ఆ స్కిప్టు తీసి గ్రూపులో పోస్ట్ చేశానని, పూరి కనెక్ట్స్ నుంచి డిజిటల్ టీమ్ ఫోన్ చేసి డిలీట్ చేయమన్నారు. ఇది జరిగి రెండు రోజులు అవుతోంది. ఆ కంటెంట్ ఇంకా సదరు వెబ్ సైట్లో ఉంది. నేను డబ్బు డిమాండ్ చేశాననడంలో నిజం లేదు. ఆ స్క్రిప్టును ఇన్‌స్టా గ్రూపు నుంచి డిలీట్ చేసిన తర్వాత కూడా నాపై ఎందుకు కంప్లయింట్ చేశారో అర్థం కావడం లేదన్నారు.

ఇష్మార్ట్ శంకర్

ఇష్మార్ట్ శంకర్

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌'. డబుల్ దిమాక్ హైద‌ర‌బాదీ అనేది ట్యాగ్ లైన్‌. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్సుగా నటించిన ఈ మూవీని శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రిలీజ్ డేట్ ఖరారు

రిలీజ్ డేట్ ఖరారు

జూలై 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X