‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ట్విట్టర్ రివ్యూ... టాక్ ఎలా ఉందంటే?

Recommended Video

#ismartshankarreview: Ismart Shankar Twitter Review!! | Filmibeat Telugu

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఇటీవల ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన మాస్ సినిమాలన్నింటినీ మించి పోయేలా ఉండబోతోందనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ పాత్రను పూరి డిజైన్ చేసిన తీరు, అతడి ఊరమాస్ బిహేవియర్, నిధి అగర్వాల్, నభా నటేష్ గ్లామర్, మణిశర్మ సంగీతం సినిమాపై క్రేజ్ మరింత పెరిగేలా చేశాయి. ఈ ఎఫెక్టుతో అడ్వాన్స్ బుకింగ్స్ బాగా పెరిగాయి. ఆల్రెడీ యూఎస్ఏతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల షోలు ప్రారంభం అయ్యాయి. ట్విట్టర్ ద్వారా టాక్ బయటకు వచ్చింది.

బ్యాడ్ స్క్రీన్ ప్లే

బ్యాడ్ స్క్రీన్ ప్లే

అయితే కొందరు ఈ మూవీ ఫస్టాఫ్‌‌పై భిన్నమైన అభిప్రాయలు వ్యక్తం చేశారు. అర్థం పర్థం లేని సీక్వెన్సెస్, అనవసరమైన లౌడ్‌నెస్, బ్యాడ్ స్క్రీన్ ప్లే.... రామ్ పెర్పార్మెన్స్, ఫస్టాఫ్‌లో వచ్చే రెండు సాంగ్స్ మాత్రమే బావున్నాయని అంటున్నారు.

పూరి ఇంకా మారలేదు

పూరిగారు మీరు ఇంకా మారలేదు సర్. కొడతారు అనుకున్న ఈ సారి.. మహేష్ అన్న పూరితో సినిమా చేయకపోవడమే బెటర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

దిమాక్ ఖరాబ్ అనేలా ఉంది

దిమాక్ ఖరాబ్ అనేలా ఉంది

ఇస్మార్ట్ శంకర్ మూవీకి చాలా ఎక్స్‌పెక్టేషన్లతో వెళ్లాం. కానీ దిమాక్ ఖరాబ్ చేసింది అంటూ... కొందరు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పూరి ఈజ్ బ్యాక్

పూరి ఈజ్ బ్యాక్

‘ఇస్మార్ట్ శంకర్' సినిమాతో పూరి మళ్లీ ఫాంలోకి వచ్చారని, చాలా రోజుల తర్వాత పూరి అభిమానులు కోరుకునే విధంగా పూర్తి మాస్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారనే అభిప్రాయాలు మరికొందరు వ్యక్తం చేశారు.

నీచంగా ఉండకపోడమే డీసెంట్

నీచంగా ఉండకపోడమే డీసెంట్

నీచంగా ఉండకపోడమే డీసెంట్ అనే స్టేజీకి వచ్చాడు పూరి జగన్నాధ్... ఆయన రియల్ విజనరీ అంటూ కొందరు ఈ సినిమాపై తమ ఓపీనియన్స్ వెల్లడిస్తున్నారు. మాస్ స్టఫ్ ఇష్టపడే ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

గుడ్ రెస్పాన్స్

గుడ్ రెస్పాన్స్

‘ఇస్మార్ట్ శంకర్' మూవీకి అంతటా మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ డైలాగులు స్టైలిష్‌గా ఉన్నాయంటున్నారు. పూరి జగన్నాధ్ డైరెక్షన్ కుమ్మేశాడని, మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుందని, ముఖ్యంగా టైటిల్ సాంగ్ అరుపులే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫస్టాప్ అదిరిపోయింది.

ఫస్టాప్ అదిరిపోయింది.

ఇస్మార్ట్ శంకర్ మూవీ ఫస్టాఫ్ అదిరిపోయింది. పూరి ఈ మూవీని ఇంత మాస్ మసాలాతో తీస్తారని ఊహించలేదు. సినిమా 100 డేస్ పక్కా అంటూ కొందరు ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయం వెల్లడించారు.

బుకింగ్స్ అదిరిపోయాయి

బుకింగ్స్ అదిరిపోయాయి

ఇస్మార్ట్ శంకర్ టికెట్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రల్లో కలిపి ఫస్ట్ డే రూ. 5 కోట్ల షేర్ రాబట్టడం ఖాయం అని అంటున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఫస్ట్ డే టికెట్స్ దొరక్క వీకెండ్ బుక్ చేసుకున్నారట.

తొలి 30 నిమిషాలు కేక

తొలి 30 నిమిషాలు కేక

ఇస్మార్ట్ శంకర్ మూవీ తొలి 30 నిమిషాల మేకింగ్ రేసీగా ఉంది. పూరి మరోసారి తన స్టైల్ ఎలా ఉంటుందో చూపించాడు... అంటూ కొందరు కొందరు ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X