పూరి జగన్నాధ్ ప్లానింగ్ మొత్తం నాశనం, హీరోయిన్‌కు క్లాస్ పీకిన డైరెక్టర్!

Recommended Video

Puri Jagannadh Angry On Actress Nidhi Agarwal | Ismart Shankar | Ram Pothineni || Filmibeat Telugu

పూరి జగన్నాధ్ సినిమా తీస్తున్నారంటే పక్కా ప్లానింగ్ ఉంటుంది. సెట్స్ మీదకు వచ్చిన తర్వాత షూటింగ్ చకచకా జరిగిపోతుంది. ఆయన స్కెచ్ వేశారంటే... చిత్రీకరణ డిలే అయ్యే అవకాశం దాదాపుగా ఉండదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా షూటింగ్ పూర్తి చేసే దర్శకుడిగా పూరికి పేరుంది.

ప్రస్తుతం పూరి జగన్నాధ్... రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్. గోవా, హైదరాబాద్, వారణాసి షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూరఫ్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశారు. అయితే హీరోయిన్ నిధి అగర్వాల్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ మొత్తం తారుమారైందట.

పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న నిధి అగర్వాల్

పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న నిధి అగర్వాల్

‘ఇస్మార్ట్ శంకర్' మూవీ యూనిట్‌ న్యూ షెడ్యూల్ కోసం యూరఫ్ వెళ్లాల్సి ఉంది. అయితే నిధి అగర్వాల్ తన పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడంతో అంతా తలక్రిందులైందట. ఆమె దాన్ని ఎక్కడ మిస్ చేసుకుందో తెలియదు కానీ చివరి నిమిషంలో ఈ విషయం చెప్పి అందరికీ షాకిచ్చిందట.

నిధి అగర్వాల్‌కు క్లాస్ పీకిన పూరి

నిధి అగర్వాల్‌కు క్లాస్ పీకిన పూరి

నిధి అగర్వాల్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ తారుమారు కావడంతో పూరికి మండి పోయిందట, ఆమె నిర్లక్ష్యం కారణంగా ఖర్చు కూడా పెరిగిపోయే పరిస్థితి ఏర్పడటంతో గట్టిగా క్లాస్ పీకాడట. ‘ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి పూరి దర్శకత్వం వహించడంతో పాటు తన సొంత బేనర్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

షెడ్యూల్ మార్చేసిన పూరి

షెడ్యూల్ మార్చేసిన పూరి

నిధి అగర్వాల్ చేసిన పనికి చేసేది లేక... షూటింగ్ షెడ్యూల్ మొత్తం మార్చేశాడట పూరి. ఆమెకు కొత్త పాస్ పోర్ట్ వచ్చే గ్యాపులో ఇతర పనులు పూర్తి చేసేలా ఏర్పాటు చేశాడట. నిధి అగర్వాల్ ఇష్యూ క్లియర్ అవ్వగానే చిత్ర బృందం ఫారిన్ షూటింగ్ చేసేందుకు బయల్దేరనుంది.

ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X