మాస్ పవర్... ‘ఇస్మార్ట్ శంకర్’ బిజినెస్ అదిరిపోయింది!

Recommended Video

Ismart Shankar Pre-release Business Is 'Too High' || Filmibeat Telugu

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. జులై 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ మూవీలో మాస్ కంటెంట్ ఏ రేంజిలో ఉంటుందో చెప్పకనే చెప్పింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇస్మార్ శంకర్ మూవీ మాస్ ఆడియన్స్‌ను మెప్పించడం ఖాయం అని తేలడంతో.... బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. పూరి వరుస ప్లాపుల్లో ఉన్నా అవేమీ పట్టించుకోకుండా డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం గమనార్హం.

వరల్డ్ వైడ్ ఎంతకు అమ్మారంటే...

వరల్డ్ వైడ్ ఎంతకు అమ్మారంటే...

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ‘ఇస్మార్ట్ శంకర్' మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 17 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. మాస్ మూవీ అయినప్పటికీ ఓవర్సీస్‌, యూఎస్ఏలో కూడా మంచి మంచి ఆఫర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఏరియా వైజ్ బిజినెస్

ఏరియా వైజ్ బిజినెస్

నైజాం రూ. 6.50 కోట్లు, సీడెడ్ రూ. 2.52 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.40 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 1.05 కోట్లు, కృష్ణ రూ. 95 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 90 లక్షలు, గుంటూరు రూ. 1.10 కోట్లు, నెల్లూరు రూ. 48 లక్షలకు అమ్మడైనట్లు సమాచారం. రెస్టాఫ్ ఇండియా రూ. 90 లక్షలు, ఓవర్సీస్ రూ. 1.20 కోట్ల ధరపలికిందట.

డిజిటల్, శాటిలైట్ రైట్స్

డిజిటల్, శాటిలైట్ రైట్స్

'ఇస్మార్ట్ శంకర్' మూవీపై రిలీజ్ ముందే మంచి హైప్ రావడంతో ఈ చిత్రాన్ని దక్కించుకోవడానికి శాటిలైట్ ఛానల్స్, డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు పోటీ పడ్డాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఇలా అన్నీ కలిపి రూ. 14 కోట్ల ఆదాయం వచ్చిందట.

ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్

రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X