ఒక హీరో ఎదగాలంటే మరో హీరోను అణగదొక్కాలి.. సునీల్‌పై ఆకాష్ షాకింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో ఎందరో నటీనటులు అలా వచ్చి ఇలా వెళ్లారు. కొందరు కొంతకాలం పాటు వెండితెరపై కనిపించి కనుమరుగవ్వగా, మరికొందరు ఎలాంటి గుర్తింపు తెచ్చుకోకుండానే వెనుదిరిగారు. ఆ లిస్ట్‌లో 'ఆనందం' ఫేమ్ ఆకాష్ కూడా ఒకరు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన సినీ నటుడు సునీల్, పూరి జగన్నాథ్, రవితేజలపై సంచలన కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి పోతే..

ఆనందం మూవీ.. ఆకాష్ ప్రయాణం

ఆనందం మూవీ.. ఆకాష్ ప్రయాణం

2000 దశకం లోనే 'ఆనందం' సినిమాలో హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యాడు ఆకాష్. అప్పట్లో ఈ సినిమా అందించిన విజయం ఆయన్ను ఎక్కడికో తీసుకెళ్తుందని అనుకున్నారంతా. కానీ ఊహించని రీతిలో ఆయన సినీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారి వెండితెరపై కనుమరుగై పోయాడు. అయితే ఇందుకు కారణాలు చెబుతూ ఇన్నాళ్లకు మీడియా ముందు నోరువిప్పాడు హీరో ఆకాష్.

రాజకీయాలకు పాల్పడి తొక్కేశారు

రాజకీయాలకు పాల్పడి తొక్కేశారు

సినీ ఇండస్ట్రీలో కొందరు రాజకీయాలకు పాల్పడి తనను తొక్కేశారంటూ ఆవేదన చెందాడు ఆకాష్. కమెడియన్ సునీల్ కూడా తనను వాడుకున్నారని ఆయన గురించి చెప్పాడు. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎన్నో రాజకీయాలు ఉంటాయని.. ఒక హీరో ఎదగాలంటే మరో హీరోను అణగదొక్కాలి అంటూ సంచలనం సృష్టించాడు ఆకాష్.

దీనివెనక ఎవరో ఉన్నారనే అనుకుంటున్నా

దీనివెనక ఎవరో ఉన్నారనే అనుకుంటున్నా

ఆనందం తర్వాత నాలుగైదు మంచి కథలున్న సినిమాలు చేశాను. కానీ అవేవీ విడుదల కాలేదు. నేను మంచి మనసుతో నా వల్ల నిర్మాతలకు డబ్బు వస్తుందని సినిమాలు చేస్తే.. వాళ్లు మాత్రం విడుదల చేయకుండా ఆపేశారని అన్నాడు ఆకాష్. దాని వెనక ఎవరో ఉన్నారనే నేను అనుకుంటున్నానని చెబుతూ కొందరు నటీనటులపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

ఆ టైమ్‌లో సునీల్ కలిశాడు..

ఆ టైమ్‌లో సునీల్ కలిశాడు..

‘అందాలరాముడు' సినిమాలో సునీల్ హీరోగా నటిస్తున్నప్పుడు తనను కలిశాడని అన్నాడు ఆకాష్. ఆ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని చెప్పారని, నేను గెస్ట్ రోలే కదా అని ఒప్పుకున్నానని అన్నాడు. చివరకు ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కానీ సక్సెస్ మీట్‌‌లో మాత్రం సునీల్ తన పేరు ఎక్కడా చెప్పలేదని అన్నాడు ఆకాష్.

పూరీ జగన్నాథ్‌తో మాట్లాడా.. అదే జరిగితే

పూరీ జగన్నాథ్‌తో మాట్లాడా.. అదే జరిగితే

ఇక ‘ఇస్మార్ట్ శంకర్' విషయానికొస్తే.. అది తాను రాసుకున్న కథ అని చెప్పాడు ఆకాష్. ఆ సినిమా టీజర్, ట్రైలర్ చూసుంటే కచ్చితంగా కోర్టులో కేసు వేసేవాడినని, కానీ సినిమా విడుదల అవుతుందనగా కొన్నిరోజుల ముందు ఆ సినిమా గురించి తనకు తెలిసిందని అన్నాడు. ఈ విషయాన్ని తాను పూరీ జగన్నాథ్ సర్‌తో మాట్లాడానని, తాను తలుచుకుని ఉంటే సినిమా విడుదలైన రోజు కూడా కోర్టులో కేసు వేయొచ్చని.. అదే జరిగితే అప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్'కు ఇన్ని కలెక్షన్లు వచ్చి ఉండేవి కావని చెప్పాడు.

Recommended Video

Old Movie Review : Anandam The Best Comedy Entertainer
రవితేజ ఒక్కడే..

రవితేజ ఒక్కడే..

ఇండస్ట్రీలో తనతో కాస్త మాట్లాడుతున్నవారు ఎవరైనా ఉన్నారంటే అది రవితేజ గారే అని ఆకాష్ అన్నాడు. ఆయన నటించిన తొలి సినిమా ‘చిరంజీవులు'లో తాను రెండో హీరోగా నటించానని.. అలా తమ మధ్య స్నేహం పెరిగిందని చెప్పాడు.వెబ్ సిరీస్‌లు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇక తన బ్యానర్‌పైనే మంచి కథ రాసుకుని సినిమా తీస్తానని ఆకాష్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X