టాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో.. తొక్కేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన
Recommended Video
సినిమా అనే రంగుల ప్రపంచంలో జనానికి తెలియని కష్టాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీనే నమ్ముకొని వచ్చిన కొందరు నటీనటుల భవితవ్యం అంధకారం లోకి నెట్టివేయబడుతుంటుంది. ఇలాంటి విషయాలు బయటకు తెలియవు. సినిమా వాళ్ళకేంటి? అద్దాల మేడలు, అఫీషియల్ జీవితాలు అనుకుంటారు జనం. కానీ కొన్ని సందర్భాల్లో తాము పడిన కష్టాలు వివరిస్తూ నటీనటుల ఆవేదన చూస్తే.. సినీ ఇండస్ట్రీలో కూడా అణిచివేతల పర్వం ఉంటుందని తెలుస్తుంది. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో తనకు జరిగిన అన్యాయం ఇదీ అని వివరిస్తూ మీడియా ముందుకొచ్చాడు హీరో ఆకాష్. ఇంతకీ ఆయన చెప్పిన విషయాలేంటి? వివరాల్లోకి పోతే..

ఆనందం హీరోగా సుపరిచితం
2001 సంవత్సరం ఆనందం సినిమాలో హీరోగా ఆకాష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యాడు. అప్పట్లో ఈ సినిమా అందించిన విజయం ఆయన్ను ఎక్కడికో తీసుకెళ్తుందని అనుకున్నారంతా. కానీ ఊహించని రీతిలో ఆయన సినీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారి.. వెండితెరపై కనుమరుగై పోయాడు ఆకాష్. అయితే ఇందుకు కారణాలు చెబుతూ ఇన్నాళ్లకు తాజాగా మీడియా ముందు నోరువిప్పాడు హీరో ఆకాష్.

టాలీవుడ్ దర్శకనిర్మాతలు చేసిన అన్యాయం అంటూ
ఎన్నో ఆశలతో లండన్‌లో మంచి ఉద్యోగం వదులుకొని సినిమాల్లో రాణించాలని తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని ఆయన చెప్పాడు. 'ఆనందం' సినిమా రూపంలో హిట్ పడటంతో సినీ కెరీర్ సక్సెస్ అయినట్లే అని భావించగా ఆ తర్వాత కొందరు టాలీవుడ్ దర్శకనిర్మాతలు తనకు కావాలనే తొక్కేశారని, తనకు తీరని అన్యాయం చేశారని పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

నా సినిమాలు విడుదల కాకుండా చేసి..
ఆనందం సినిమా తర్వాత తాను నటించిన ఐదు సినిమా విడుదల కాకుండా చేసి కెరీర్ నాశనం చేశారని అన్నాడు ఆకాష్. 'ఆనందం' కంటే ముందే 'ఇష్టపడి' అనే సినిమా చేశా. 50 వేలు రెమ్మ్యూనరేషన్ ఇస్తామని చివరకు కేవలం 25 వేలు ఇచ్చినా అడ్జస్ట్ అయ్యా. షూటింగ్ అంతా ఫినిష్ చేశారు కానీ చివరకు సినిమా విడుదల చేయకుండా ఆపేశారు. ఆ సినిమాలో నాతో పాటు కోట శ్రీనివాస రావు లాంటి పెద్ద నటీనటులు నటించారు. అది ఖచ్చితంగా హిట్ కావాల్సిన సినిమా.. అలా మొదటి నష్టం జరిగింది అన్నాడు.

18 ఏళ్లుగా తొక్కేస్తూనే ఉన్నారు
ఆ తర్వాత ముత్యాల సబ్బయ్యతో 'ఇదేం ఊరురా బాబు', తమిళ దర్శకుడు డైరెక్టర్ విక్రమన్ తో 'ఆకాశం', మరో పేరున్న నిర్మాతతో 'జూన్ జూలై' చేయగా ఆ సినిమాలు రిలీజ్ చేయకుండా ఆపేసి నా కెరీర్ ఎదగకుండా కొందరు దర్శకనిర్మాతలు అడ్డు పడ్డారని ఆవేదన చెందాడు ఆకాష్. తాను డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదని, సినిమాల్లో రాణించాలని అనుకుంటే ఇలా అణిచివేయడం తన భవిష్యత్‌ని దెబ్బతీసిందని సంచలన ఆరోపణలు చేశాడు ఆకాష్.

ఇస్మార్ట్ శంకర్ విషయమై కూడా
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ నాదే అని, తన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని.. ఆ కథను కాపీ కొట్టి పురీ సినిమా తీశాడని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు ఆకాష్. మొత్తానికి ఆకాష్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవడ్ లో చర్చనీయాంశంగా మారాయి.


Click it and Unblock the Notifications











