అలాంటి వారిని హైలెట్ చేయొద్దు: జూ ఎన్టీఆర్ పిలుపు!
ఏదైనా విషయం ఉంటే నేనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా లేదా ప్రకటన ద్వారా తెలియజేస్తాను. రాజకీయపరంగా తనపై ఎలాంటి ప్రచారం జరిగినా నమ్మవద్దని జూ ఎన్టీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: 'నవ భారత్ నేషనల్ పార్టీ' పేరుతో ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీకి యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ను అధ్యక్షుడిగా నియమిస్తూ... ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడని, అందుకే ఈ కొత్త పార్టీ అంటూ ప్రచారం జరిగింది.
అయితే ఈ పార్టీకి, ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. ఎవరో కావాలని ఇలా చేసి... ఎన్టీఆర్ మీద దుష్ర్పచారం చేసారని ఆయన అభిమానులు తేల్చేసారు. తాజాగా ఈ వ్యవహారం ఎన్టీఆర్ వరకు వెళ్లింది.

స్పందించిన ఎన్టీఆర్
నవ భారత్ నేషనల్ పార్టీ' వ్యవహారాన్ని కొందరు అభిమానులు ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 'జై లవకుశ' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ ఈ ప్రచారం గురించి విని నవ్వుకున్నారట. ఇలాంటి పుకార్లకు తాను పట్టించుకోనని, అభిమానులు కూడా వీటిని పట్టించుకోవద్దన్నారట.

హైలెట్ చేయొద్దు
ఏదైనా విషయం ఉంటే నేనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా లేదా ప్రకటన ద్వారా తెలియజేస్తాను..... ఇలాంటి ప్రచారాలను, వాటిని ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకుని అనవసరంగా వారిని హైలెట్ చేయొద్దు అని ఎన్టీఆర్ అభిమానులకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

జై లవ కుశ
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ బేనర్లో ‘జై లవ కుశ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వల్ల కళ్యాణ్ రామ్‌కు రూ. 30 కోట్లు లాభం... అంటూ ప్రచారం మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.



Click it and Unblock the Notifications











