»   » ఎన్టీఆర్ వల్ల కళ్యాణ్ రామ్‌కు రూ. 30 కోట్లు లాభం... అంటూ ప్రచారం!

ఎన్టీఆర్ వల్ల కళ్యాణ్ రామ్‌కు రూ. 30 కోట్లు లాభం... అంటూ ప్రచారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ బేనర్లో 'జై లవ కుశ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాబీ(కెఎస్.రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లే కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకటి రెండు తప్ప అన్ని నష్టాలు మిగిల్చినవే. కళ్యాణ్ రామ్ చివరి మూవీ 'ఇజం' కూడా లాభాలు తేలేదు. అయితే ఇపుడు ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తుండటంతో కళ్యాణ్ రామ్ నష్టాల బాట నుండి లాభాల్లోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది.


బడ్జెట్ ఎంత?

బడ్జెట్ ఎంత?

ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తో కలిసి ఈ సినిమాను దాదాపు రూ. 50 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తమ్ముడి సినిమా కావడంతో ఎక్కడా రాజీపడకుండా, ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను తీస్తున్నారు.


ప్రి రిలీజ్ బిజినెస్

ప్రి రిలీజ్ బిజినెస్

ఎన్టీఆర్ గత సినిమా ‘జనతా గ్యారేజ్' బక్సాఫీసు వద్ద రూ. 80 కోట్ల మార్కును అందుకుంది. ఈ నేపథ్యంలో ‘జై లవకుశ' చిత్రాన్ని రూ. 80 కోట్లకు తక్కువ కాకుండా అమ్మాలని నిర్ణయించుకున్నారు. పలువురు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాను భారీ ధరకు కొనేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.


30 కోట్ల లాభం అంటూ ప్రచారం

30 కోట్ల లాభం అంటూ ప్రచారం

అంతా అనుకున్నట్లు జరిగితే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వల్ల రూ. 30 కోట్లకు తక్కువ కాకుండా టేబుల్ ప్రాఫిట్ వస్తుందని.... దీంతో కళ్యాణ్ రామ్ చాలా ఈజీగా నష్టాల నుండి బయట పడతాడంటూ ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది.


జై లవ కుశ: ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ ఈవిడే..

జై లవ కుశ: ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ ఈవిడే..

‘జై లవకుశ' చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెండు పాత్రలకు మాత్రమే హీరోయిన్ ఉంటుంది....ఈ రెండు పాత్రలకుగాను ఇద్దరు హీరోయిన్లు ఖరారయ్యారు. అందుకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.


బ్యూటిఫుల్ మూమెంట్: బాలయ్య కాళ్లకు నమస్కరించిన ఎన్టీఆర్!

బ్యూటిఫుల్ మూమెంట్: బాలయ్య కాళ్లకు నమస్కరించిన ఎన్టీఆర్!

బ్యూటిఫుల్ మూమెంట్: బాలయ్య కాళ్లకు నమస్కరించిన ఎన్టీఆర్..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
Apparently Jr NTR's latest movie "Jai Lav Kusa" is being produced by Kalyan Ram on his NTR Arts banner. We hear that they are wrapping the movie at 50 crores budgets and will not be going more than that. And then, the film got 80 crores range business offers already in the form of theatrical rights and satellite deals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu