వెరీ హాట్: ‘జ్యోతిలక్ష్మీ’ టైటిల్‌ సాంగ్‌ (వీడియో)

By Bojja Kumar

ఛార్మి ప్రధానపాత్రలో ఛార్మి కౌర్‌ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్‌ బ్యానర్స్‌పై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్‌, తేజ్‌, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జ్యోతిలక్ష్మీ'. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను జూన్‌ 1న విడుదల చేశారు.

‘జ్యోతిలక్ష్మీ.. జ్యోతిలక్ష్మీ ఐ యామ్‌ కాస్ట్‌లీ టు టచ్‌ మి... ఏయ్‌ రాసుకోర సాంబ.. నేనల్లాటప్పా కాదు.. ట్రై చేసుకోర సాంబ.. నేనార్డినరీ కాదు..' అంటూ భాస్కరభట్ల రాసిన పాటను సునీల్‌ కశ్యప్‌ సంగీత సారధ్యంలో ఉమా నేహా గానం చేశారు. ఈ పాటతోపాటు ‘జ్యోతిలక్ష్మీ' చిత్రం మేకింగ్‌ వీడియో కూడా విడుదల చేశారు.

Jyothi Lakshmi Title Song

ఈ సందర్భంగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ` ‘‘ఈరోజు మా ‘జ్యోతిలక్ష్మీ' చిత్రం టైటిల్‌ సాంగ్‌ను, మేకింగ్‌ వీడియోను విడుదల చేశాం. భాస్కరభట్ల చక్కని సాహిత్యం అందించిన ఈ పాటను ఉమా నేహా చాలా అద్భుతంగా పాడారు. సునీల్‌ కశ్యప్‌ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ చేశారు. జూన్‌ 4న జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ చిత్రం ఆడియోను చాలా డిఫరెంట్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. జూన్‌ 12న వరల్డ్‌వైడ్‌గా మా ‘జ్యోతిలక్ష్మీ' చిత్రం విడుదల కాబోతోంది. పూరి జగన్నాథ్‌గారికి, ఛార్మికి, మా బేనర్‌కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. ఛార్మి, సత్య, వంశీ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్.శేఖర్‌, కెమెరా: పి.జి.విందా, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X