చిరంజీవి కోసం ఆలోచిస్తున్న నాగార్జున
నిజ జీవితంలో మంచి స్నేహితులైన చిరంజీవి, నాగార్జున తమ చిత్రాలతో ఒకేరోజున క్లాష్ అవుతున్నారనే వార్త ఇద్దరు కథానాయకుల అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలమీద ఇప్పుడు మంచి హైప్ వచ్చింది. దసరా పర్వదినాన్ని టార్గెట్ చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ రెండు సినిమాలు ఒకేసారి క్లాష్ అవుతాయేమోననే ఆందోళనలకు మరో రెండురోజుల్లో ఫుల్ స్టాప్ పడనుంది. తన మిత్రుడి కోసం నాగార్జున ది ఘోస్ట్ ను రెండురోజులు వెనక్కి జరుపుకున్నారనేవార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
ఐదున కాకుండా ఏడోతేదీన విడుదలయ్యేలా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.అందరికంటే ముందుగా డేట్‌ను ప్రకటించింది నాగార్జున చిత్రమే. తర్వాత గాడ్‌ఫాదర్ ఆ తేదీని లాక్ చేసుకుంది. అలాంటప్పుడు చిరంజీవి రాజీ పడాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే కారణాలు బయటకు రాలేదుకానీ నాగార్జున చిత్ర బృందం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. ఒకవేళ ఫేస్ టు ఫేస్ అనివార్యమై ఈ రెండుచిత్రాల ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరో రెండురోజుల్లో దీనికి సంబంధించిన వార్త బయటకు రాబోతోంది. అలాగే సినిమా ప్రచారానికి సంబంధించి గాడ్ ఫాదర్ టీమ్ రేపు ఆడియో సింగల్ అప్డేట్ ఇవ్వబోతోంది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో తీసిన పాట ఎప్పడు విడుదలవబోతోందనేది చెప్పబోతున్నారు. అయితే ఈ ఇద్దరు మిత్రులు సరదాగా ఒకసారి ఒకేరోజు తలపడి చూద్దామా అని అనుకుంటున్నారా? లేదంటే ఘోస్ట్ ను వెనక్కి జరపబోతున్నారా? అనే విషయమైయ రెండురోజుల్లో స్పష్టత రానుంది.


Click it and Unblock the Notifications











