శ్రీరెడ్డి ఫోన్ కాల్ లీక్: పెను సంచలనం, భారీ కుట్ర.. పవన్ ఎలా బతుకుతాడో, ఎలా గెలుస్తాడో చూస్తా!
టాలీవుడ్ ని మాత్రమే కాదు.. ఏపీ రాజకీయాలనే కుదుపు కుదిపే పెను సంచలన వార్త అని చెప్పొచ్చు. శ్రీరెడ్డి తన స్నేహితురాలు, జూనియర్ ఆర్టిస్టు అయిన తమన్నా తో మాట్లాడిన ఫోన్ కాల్ బయటకు లీక్ ఐంది. ఈ ఫోన్ కాల్ లో శ్రీరెడ్డి, తమన్నా మధ్య జరిగిన సంభాషణ పెను సంచలనంగా ఆమె అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి సంభాషణలో ఏపీలో ఉన్నా తెలుగు దేశం పార్టీ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన కూడా వచ్చింది. ఫోన్ సంభాషణ చివర్లో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గురించి తమన్నాతో మాట్లాడిన విషయాలు తీవ్ర వివాదంగా మారె పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ పై, జనసేన పార్టీపై భారీ కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు కలగక మానదు. శ్రీరెడ్డి తన పోరాటాన్ని ఢిల్లీవెదికగా కూడా చేయబోతున్నట్లు ఈ ఫోన్ సంభాషణలో తెలిపింది. శ్రీరెడ్డి, జూనియర్ ఆర్టిస్ట్ తమన్నా మధ్య ఫోన్ సంభాషణ ఈ క్రింది విధంగా సాగింది.

వర్మ పెద్ద ప్లాన్ వేసాడు
రాంగోపాల్ వర్మపెద్ద ప్లాన్ వేశాడు అక్కా అని శ్రీరెడ్డి తన స్నేహితురాలు తమన్నాతో తెలిపింది. డబ్బులు తీసుకోమన్నారు అక్కా. పవన్ కళ్యాణ్ ని తిట్టమని చెప్పింది వాడే. పవన్ కళ్యాణ్ నితిట్టినందువల్లే ఉద్యమం నీరుగారిపోయింది. జూనియర్ ఆర్టిస్టులు రివర్స్ అయ్యారు అక్కా.

అపూర్వ మద్దత్తు
దీనికి తమన్నా బదులు ఇచ్చింది. అయ్యో శ్రీ.. అపూర్వ కూడా వ్యతిరేకమేనా.. కాదు అక్క సపోర్ట్ మనకు ఉంది అని శ్రీరెడ్డి తెలిపింది. ఇప్పుడు వెనకడుగు వేస్తే ఉద్యమం నీరుగారిపోతుంది శ్రీ గుర్తుంచుకో అంటూ తమన్నా శ్రీరెడ్డితో అంది.

వైసిపి వాళ్ళు ప్లాన్ వేశారు
వైసిపి వాళ్ళు ప్లాన్ వేసుకుని వచ్చారు. వాళ్ళ మాటలు వినివుంటే ఇంకా ఇరుక్కుపోయేవాళ్ళం. నా ఏడుపు చూసి ఆగారు. జూనియర్ ఆర్టిస్టులకు 1000, 2000 కావాలి అందుకే వెనకడుగు వేసి ఉంటారు శ్రీ. మనతో ఉంటె అవి కూడా రావేమోనని వారి భయం.

ఎజెండా తయారు చేద్దాం
అక్కా రెండు రోజులు ఎక్కడా ఏమీ మాట్లాడకు. మళ్ళి అజెండా తయారు చేద్దాం.. వైసీపీతో కాదు.. టీడీపీ సపోర్ట్ తో కొడదాం.. ఢిల్లీలో పోరాటం చేద్దాం.

మహా న్యూస్ మూర్తి ప్రస్తావన
తమన్నా మాట్లాడుతూ మహా న్యూస్ మూర్తి సపోర్ట్ చేయలేదా.. మూర్తిగారు టిఆర్పి కోసం గేమ్ ప్లాన్ వేసాడు అక్కా. కానీ మనకు మాత్రం మద్దత్తుగానే ఉన్నారు. తమన్నా మాట్లాడుతూ.. వైసీపీతో నేను ఉన్న పోస్టర్స్ బయట పెట్టింది మాధవిలతే శ్రీ. ఇప్పుడు నేను మొత్తం అల్లరై పోయాను.

నా తొందర పాటు వల్లే అక్కా
ఉద్యమం నీరు గారిపోవడానికి కేవలం నా తొందరపాటు కారణం అక్కా. బిడ్డలాంటి ఉద్యమాన్ని నేనే చంపుకున్నా. మళ్ళి బ్రతికించుకుంటా అక్కా.

పవన్ కళ్యాణ్‌ని మరోమారు దారుణంగా
శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఈ నా కొడుకులని చావు దెబ్బ కొడతా అక్కా. పవన్ కళ్యాణ్ ఎలా బతుకుతాడో, ఎలా గెలుస్తాడో చూస్తా, చివరి రక్తపు బొట్టు వరకు వాడి ఓటమి కోసం కృషి చేస్తా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.


Click it and Unblock the Notifications











