For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Liger ఆ సినిమాకు కాపీనా: ట్రైలర్‌ తర్వాత డౌట్స్.. క్లారిటీ వచ్చేసిందిగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది టాలెంట్ ఉన్న హీరోలు సత్తా చాటుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే స్వయంకృషితో ఎదిగిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. హీరోగా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. భారీ స్థాయిలో మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో విజయ్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు 'లైగర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  వరుస ఫ్లాపులతో విజయ్ నిరాశ

  వరుస ఫ్లాపులతో విజయ్ నిరాశ


  హీరోగా చేసిన తొలి చిత్రం 'పెళ్లి చూపులు'తో విజయ్ దేవరకొండ విజయాన్ని అందుకున్నాడు. దీని తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. అనంతరం 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి హిట్లను అందుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులను చవి చూస్తున్నాడు. దీంతో ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

  తల్లైన తర్వాత మరో యాక్టర్‌తో హీరోయిన్ ఎఫైర్: బెడ్‌పై రొమాన్స్ చేసే పిక్ వైరల్

  లైగర్‌గా రెడీ అవుతోన్న విజయ్

  లైగర్‌గా రెడీ అవుతోన్న విజయ్


  టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సత్తా చాటిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతుంది.

  హాలీవుడ్ రేంజ్‌లో వస్తుందిగా

  హాలీవుడ్ రేంజ్‌లో వస్తుందిగా


  క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా రేంజ్ ఖండాంతరాలు దాటిపోయిందనే అనుకోవాలి.

  పొట్టి డ్రెస్‌తో షాకిచ్చిన భూమిక: వామ్మో అలా పడుకుని అందాల విందు

  ప్రమోషన్ షురూ.. ట్రైలర్ హిట్

  ప్రమోషన్ షురూ.. ట్రైలర్ హిట్


  'లైగర్' సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందుకోసం స్పెషల్ ప్లాన్లను కూడా రెడీ చేసుకుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ వీడియో టాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డును క్రియేట్ చేసుకుంది.

   ట్రైలర్ తర్వాత పెరిగిన డౌట్స్

  ట్రైలర్ తర్వాత పెరిగిన డౌట్స్


  విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లైగర్' మూవీ... గతంలో రవితేజ హీరోగా వచ్చిన 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రం ఆధారంగా రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా విడుదలైన ట్రైలర్‌లో అలాంటి సన్నివేశాలే కనిపించాయి. దీంతో ఆ కాపీ సందేహాలు మరింతగా బలపడ్డాయనే చెప్పుకోవాలి.

  స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన ప్రియాంక: అబ్బో తడిచిన అందాలను చూపిస్తూ!

  లైగర్ ఆ సినిమాకు కాపీ కాదట

  లైగర్ ఆ సినిమాకు కాపీ కాదట


  పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'లైగర్' మూవీ 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రానికి కాపీగా వస్తుందంటూ వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ స్పందించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలకు అస్సలు ఏమాత్రం సంబంధం ఉండదని.. రెండు కథల్లో చాలా వ్యత్యాసం ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, ఇది దానికంటే డబుల్ ఇంపాక్ట్ చూపించబోతుందట.

  English summary
  Vijay Devarakonda Now Doing Liger Movie Under Puri Jagannadh Direction. Now Unit Gave Clarity on This Movie Story Line.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X