LIGER Trailer: టాలీవుడ్‌లో విజయ్ ఆల్‌టైం రికార్డు.. RRR, రాధేశ్యామ్‌ను దాటేసిన లైగర్

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న విజయ్.. ఇప్పుడు 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో సాధించిన రికార్డుల గురించి తెలుసుకుందాం పదండి!

లైగర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న విజయ్

లైగర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న విజయ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఇది ఆగస్టు 25న రిలీజ్ అవుతుంది.

ట్రైలర్ విడుదల చేసిన లైగర్ టీమ్

ట్రైలర్ విడుదల చేసిన లైగర్ టీమ్

పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లైగర్' మూవీ విడుదలకు సమయం ఆసన్నం అవుతుండడంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే జూలై 21న ఈ మూవీ యూనిట్ ట్రైలర్ వీడియోను విడుదల చేసింది. మొత్తంగా 2.02 నిమిషాల నిడివితో వచ్చిన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా తీసుకు వచ్చారు.

అత్యధిక రెస్పాన్స్.. తెలుగు రిపోర్టు

అత్యధిక రెస్పాన్స్.. తెలుగు రిపోర్టు

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'లైగర్' మూవీ ట్రైలర్ వీడియో సూపర్బ్‌గా ఉంది. ఇందులో హీరో ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి యూట్యూబ్‌లో 24 గంటల్లో 16.80 మిలియన్ వ్యూస్, 561K లైక్స్ వచ్చాయి.

లైగర్‌కు ఏ భాషలో ఎలాంటి రిపోర్ట్

లైగర్‌కు ఏ భాషలో ఎలాంటి రిపోర్ట్

'లైగర్' మూవీ ట్రైలర్‌కు అన్ని భాషల్లోనూ భారీ రెస్పాన్స్ దక్కింది. తెలుగులో ఇది 24 గంటల్లో 16.80 మిలియన్ వ్యూస్, 561K లైక్స్ సాధించింది. అలాగే, హిందీలో 30.21 మిలియన్ వ్యూస్, 598.6K లైక్స్, తమిళంలో 2.09 మిలియన్ వ్యూస్, 115K లైక్స్, మలయాళంలో 0.9 మిలియన్ వ్యూస్, 36K లైక్స్, కన్నడంలో 0.6 మిలియన్ వ్యూస్, 33K లైక్స్‌ను సాధించింది.

తెలుగులో ఏడు.. ఆల్‌టైం రికార్డుతో

తెలుగులో ఏడు.. ఆల్‌టైం రికార్డుతో

'లైగర్' మూవీ ట్రైలర్ తెలుగులో పలు రికార్డులు బ్రేక్ చేసింది. మరీ ముఖ్యంగా ఇది టైర్ 2 హీరోల జాబితాలో ఆల్‌టైం రికార్డును క్రియేట్ చేసింది. ఈ లిస్టులో గతంలో 'ది వారియర్' టాప్‌లో ఉండగా ఇప్పుడు 'లైగర్' దాన్ని దాటేసింది. అలాగే ఓవరాల్‌గా చూస్తే ఇది ఏడో స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో సర్కారు వారి పాట (26.77 మిలియన్స్) టాప్‌లో కొనసాగుతోంది.

సౌత్ ఇండియాలో మూడో స్థానానికి

సౌత్ ఇండియాలో మూడో స్థానానికి


క్రేజీ కాంబోలో వస్తోన్న 'లైగర్' మూవీ ట్రైలర్ హిందీ వెర్షన్‌కు అత్యధిక వ్యూస్ వచ్చాయి. దీంతో ఇది దక్షిణ భారతదేశం నుంచి వచ్చి.. హిందీలో ఎక్కువ వ్యూస్ సాధించిన చిత్రాల జాబితాలో మూడో స్థానానికి చేరుకుంది. ఇందులో 'కేజీఎఫ్ 2', 'సాహో' మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే లైగర్ మూవీ RRR, రాధేశ్యామ్‌ను వెనక్కి నెట్టేసి సరికొత్త రికార్డు కొట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X