LIGER: న్యూడ్ ఫొటోతో షాకిచ్చిన విజయ్ దేవరకొండ.. ఏదైనా ఇచ్చేస్తా అంటూ రౌడీ ట్వీట్

స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. హీరోగా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న అతడు.. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఫలితంగా తన ఫాలోయింగ్‌తో పాటు స్టార్‌డమ్‌ను కూడా భారీగా పెంచుకుంటున్నాడు.

ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'లైగర్' మూవీతో పాన్ ఇండియాపై దండయాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా విజయ్ దేవరకొండ న్యూస్ పిక్‌ను షేర్ చేశారు. దానిపై మీరూ లుక్కేయండి మరి!

 హిట్ కోసం విజయ్ ఎదురుచూపు

హిట్ కోసం విజయ్ ఎదురుచూపు

కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి 'పెళ్లి చూపులు'తో విజయ్ దేవరకొండ హీరోగా పరిచయమయ్యాడు. దీని తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో స్టార్ స్టేటస్ వచ్చింది. అనంతరం 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి హిట్లను అందుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులను చవి చూస్తున్నాడు. దీంతో హిట్ కొట్టాలన్న కసితో ఆతృతగా కనిపిస్తున్నాడు.

లైగర్‌గా వేటాడేందుకు రౌడీ రెడీ

లైగర్‌గా వేటాడేందుకు రౌడీ రెడీ

ఇంతకాలం టాలీవుడ్‌లో హవాను చూపించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది.

హాలీవుడ్ రేంజ్‌లో రాబోతుందిగా

హాలీవుడ్ రేంజ్‌లో రాబోతుందిగా

బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా రేంజ్ ఖండాంతరాలు దాటిపోయిందనే చెప్పుకోవచ్చు.

ప్రమోషన్ షురూ చేయనున్నారు

ప్రమోషన్ షురూ చేయనున్నారు

'లైగర్' సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ ఇప్పటికే ముగిసింది. అలాగే, ఇటీవలే అనన్య పాండే, విజయ్ దేవరకొండ మధ్యన ముంబైలో అదిరిపోయే సాంగ్‌ను షూట్ చేసుకున్నారు. ఇక, ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చూస్తోంది. ఇందుకోసం స్పెషల్ ప్లాన్లను కూడా రెడీ చేసుకుంటోంది.

విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్

విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'లైగర్' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఎవరూ ఊహించని ట్రీట్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నగ్నంగా ఉన్న విజయ్ దేవరకొండ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఈ హీరో తన ప్రైవేటు భాగానికి పూలను అడ్డుగా పెట్టుకున్నాడు.

ఏదైనా ఇచ్చేస్తానని రౌడీ ట్వీట్

ఏదైనా ఇచ్చేస్తానని రౌడీ ట్వీట్

'లైగర్' మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుంది? ఇందులో విజయ్ ఎంత కష్టపడ్డాడు? అనే విషయాలను పరోక్షంగా చూపించారు. ఇక, ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయ్ 'నాలో సర్వస్వం రాబట్టిన సినిమా. నటన పరంగా, మానసికంగా, శారీరకంగా నాకు ఛాలెంజింగ్ రోల్ ఇది. ఏదైనా ఇచ్చేస్తాను' అని చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X