»   » మీకు పవర్ స్టారేమో, నాకు కాదు..: పూరి ‘లోఫర్’ కామెంట్

మీకు పవర్ స్టారేమో, నాకు కాదు..: పూరి ‘లోఫర్’ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు సుప్రీమ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్‌'. సునీల్‌ కశ్యప్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది.

‘లోఫర్' ఆడియో సక్సెస్ కావడంతో విజయవాడ సమీపంలోని హాయ్ లాండ్‌లో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ పవన్‌ కల్యాణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాన్ అభిమానులను ఉద్దేశించి పూరి మాట్లాడుతూ.... పవన్ కళ్యాణ్ మీకు పవర్‌స్టారే, నాకు మాత్రం దేవుడు అన్నారు. పూరి కామెంట్ విన్నవెంటనే అభిమానులు కేరింతలు కొట్టారు.

ఈ కార్యక్రమంలో హీరో వరుణ్‌తేజ్‌, హీరోయిన్‌ దిశా పటాని, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌, సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌, నటుడు, నిర్మాత అశోక్‌కుమార్‌, అభిషేక్‌, అల్లూరి వెంకటేశ్వరరావు, పాటల రచయిత భాస్కరభట్ల, అలంకార్‌ ప్రసాద్‌, ముత్యాల రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

పూరి జగన్నాద్

పూరి జగన్నాద్


అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తర్వాత నేను చేసిన తల్లి కొడుకుల కథ. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా. సునీల్‌ కశ్యప్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దిశాపటాని త్వరలోనే పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అవుతుంది. మెగా ఫ్యామిలీలో వరుణ్‌ మరో పెద్ద హీరో అవుతాడు అన్నారు పూరి.

చిరంజీవిలా... వరుణ్ తేజ్ పేరు సంపాదించాడు

చిరంజీవిలా... వరుణ్ తేజ్ పేరు సంపాదించాడు


చిరంజీవిగారు మొన్న కలిసినప్పుడు వరుణ్‌గురించి పది నిమిషాలు మాట్లాడారు. చిరంజీవిగారు పునాదిరాళ్ళు నుండి నటిస్తున్నారు. ఎన్నో సినిమాలు హిట్‌ కొట్టారు. కథ బాగున్నా, బాగలేకపోయినా చిరంజీవిగారు బాగా చేయలేదని ఎవరం చెప్పలేం. మళ్ళీ వరుణ్‌ అలాంటి పేరుని సంపాదించుకుంటాడు. చిరంజీవి, నాగబాబు, మెగాఫ్యామిలీ గర్వపడే స్థాయికి వరుణ్‌ చేరుకుంటాడు'' అన్నారు.

సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ...

సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ...


డిసెంబర్ 17న సినిమా చూసిన అందరూ వరుణ్‌కి ఫ్యాన్‌గా మారిపోతారు. బ్రహ్మారథం పడతారు. ఓ అజానుబాహుడు హీరో అయ్యాడని అనుకుంటారు. మెగాఫ్యామిలీలో ఇప్పటి హీరోల్లో వరుణ్‌ చేసిన పెర్‌ఫార్మెన్స్‌ ఎవరూ చేయలేదు. మెగా అభిమానులకు ఒక ప్రిన్స్‌, రాకుమారుడు వచ్చాడు. పూరిగారు ఎక్స్‌ట్రార్డినరీ సినిమా తీశారు. రేపు అభిమానులందరూ ఎంజాయ్‌ చేసే సినిమా అవుతుంది'' అన్నారు.

వరుణ్ తేజ్..

వరుణ్ తేజ్..


చరణ్‌ అన్నయ్య ఈరోజు పెద్దనాన్నగారి 150వ సినిమాను అనౌన్స్‌ చేశారు. అలాగే బాబాయ్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ కోసం కూడా వెయిట్‌ చేస్తున్నాను. పెద్దనాన్న, బాబాయ్‌ని చూస్తూ పెరిగాను. వారికి నేను పెద్ద అభిమానిని. వాళ్లే నాకు ఇన్‌స్పిరేషన్‌. డెఫనెట్‌గా వారి పేరు నిలబెడతాను. పూరిజగన్‌గారికి, కళ్యాణ్‌గారికి థాంక్స్‌. డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను'' అన్నారు.

English summary
Varun Tej's Lofer movie Triple Platinum Disc function held at Vijayawada on Monday.
Please Wait while comments are loading...