లోకులు కాకులు అంటీని కలిసిన పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ శంకర్ మూవీలో?
Recommended Video

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్... లోకులు కాకులు అంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన జ్యోతి ఆంటీని కలిశారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో జ్యోతి ఆంటీ వీడియోలు సెన్సేషన్ అయ్యాయి. కొన్ని టీవీ షోలలో సైతం ఆమెపై కామెడీ స్కిట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ మూవీ ఆడియో వేడుకలో బిత్తిరి సైతం లోకులు కాకులు జ్యోతి ఆంటీని ఇమిటేట్ చేస్తూ నవ్వించారు.
తాజాగా లోకులు కాకులు జ్యోతి ఆంటీని పూరి జగన్నాథ్ కలవడం చర్చనీయాంశం అయింది. తన అభిమాన దర్శకుడిని హగ్ చేసుకుని ట్యాబ్‌లో ఆమె కుమారుడి ఫోటోలు చూపించి మురిసిపోయారు.

ఎవరీ లోకులు కాకులు ఆంటీ...
50 ఏళ్ల వయసున్న జ్యోతి అనే మహిళ కొత్త సినిమాలు విడుదలైనపుడు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షోకు హాజరై రివ్యూలు చెబుతూ సందడి చేస్తున్నారు. కుర్రకారు ఆమెను సరదాగా ఆటపట్టిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన గురించి ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు.. లోకులు కాకులు అంటూ జ్యోతి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు.

ఇస్మార్ట్ శంకర్ మూవీలో జ్యోతి ఆంటీ
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ తను రూపొందిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్' మూవీలో జ్యోతి ఆంటీతో ఓ పాత్ర వేయించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.

సహజ సిద్ధంగా ఉండాలని...
ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో జ్యోతి ఆంటీకి సూటయ్యే ఓ సీన్ పూరి రాశారని, అది ప్రేక్షకులను నవ్వించే విధంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నారు. హీరో రామ్‌తో జ్యోతి ఆంటీ సీన్లు ఉండే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

ఇస్మార్ట్ శంకర్
ఎనర్జిటిక్ హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో నిధి అగర్వాల్, నబా నటేష్ హీరోయిన్లు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. హైదరాబాద్‌లో ఫైన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. .'డబుల్ ధమాకా దిమాక్ ' అనే క్యాప్షన్ తో సినిమా వస్తుండగా సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో రామ్ ఈ సినిమాలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











