MAA Elections ప్రముఖ డైరెక్టర్‌తో నాగబాబు సీక్రెట్ మీటింగ్.. ప్రకాశ్ రాజ్ కోసం పావులు కదుపుతున్న మెగా బ్రదర్!
దక్షిణాదిలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రణరంగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా సంస్థ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే ఆశావహులు తమ గెలుపు కోసం రకరకాలుగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేయడం అనేక రకాల వివాదాలకు దారి తీసున్నాదనే విషయం సినీ వర్గాలనే కాకుండా మీడియాలో చర్చనీయాంశమైంది. తాజాగా చోటుచేసుకొన్న పరిణామాల గురించి మరికొంత సమాచారం..

ప్రకాశ్ రాజ్ ముందస్తు ప్రయత్నాలతో
ప్రస్తుతం త్వరలో జరగబోయే మా సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రకాశ్ రాజ్ ముందుగానే తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. పలువురు అగ్రనటులను సంప్రదిస్తూ తన కార్యచరణను వారి ముందు పెట్టారు. అంతేకాకుండా అన్ని వర్గాల నటీనటులను పలకరిస్తూ తమ ప్రతిపాదనను వారి ముందు ఉంచారు. ఈ క్రమంలో చిరంజీవితో ప్రకాశ్ రాజ్ కలువడం ఈ ఎన్నికల వ్యవహారానికి అగ్గి రాజేసింది.

మెగాస్టార్ చిరంజీవి భేటీ కావడంతో
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌కు తన మద్దతు ఉంటుంది. తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా ప్రకాశ్ రాజ్ కలిసారు. కాబట్టి ఆయన మద్దతు కూడా తనకే ఉండటానికి అవకాశం ఉంది అంటూ నాగబాబు ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడటంతో ఇతర పోటీదారులు తమ వ్యూహాలకు పదునుపెట్టారు. దాంతో ప్రకాశ్ రాజ్‌ను టార్గెట్‌గా చేస్తూ కొందర్ని రంగంలోకి దించారు.

ఆరు నెలల నుంచే ప్రకాశ్ రాజ్ ప్రయత్నాలు
అయితే మీడియాలో కథనాలు ఊహించని విధంగా ఉండటంతో తన ప్యానల్ సభ్యులతో ప్రకాశ్ రాజ్ మీడియా ముందుకు వచ్చారు. మా సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడమనే విషయం గత వారం రోజుల నాటిది కాదు. గత ఆరు నెలల నుంచి నా ప్రయత్నాలను, ప్రతిపాదనలను పలువురి ముందు ఉంచాను. మోహన్ బాబు, మంచు విష్ణు లాంటి ఆశావహులతో చర్చలు జరిపాను అని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు.

నాగబాబుపై నరేష్ వర్గీయులు ఫైర్
అయితే ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశం తర్వాత మరికొందరు ఎన్నికల బరిలోకి వచ్చారు. మా సంస్థ ప్రతిష్ట మసకబారిందంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. అలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు అంటూ అధ్యక్షుడు వీకే నరేష్ స్పందించారు. నరేష్ మద్దతు దారుల కూడా ప్రకాశ్ రాజ్‌ను టార్గెట్ చేసేందుకు ప్రయత్నించారు.

పూరీ జగన్నాథ్‌తో నాగబాబు భేటీ
ఇలాంటి పరిస్థితులు, పరిణామాల మధ్య నాగబాబు తనదైన శైలిలో పావులు కదుపుతున్నట్టు తెలిసింది. మంగళవారం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ఆయన ఆఫీస్‌లో సీక్రెట్‌గా సుదీర్ఘంగా చర్చలు జరిపి తమ వ్యూహాలకు పదును పెట్టినట్టు సమాచారం. అయితే నాగబాబు ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ తరఫున నటీనటులతో సంప్రదింపులు జరుపుతూ ఆయన విజయానికి తీవ్రమైన కృష్టి చేస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











