రంగస్థలం, మహానటి చిత్రాలతో డబ్బా కొట్టుకుంటున్నారు.. లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే.. మాధవీలత!

Recommended Video

Madhavi Latha Makes Sensational Comments On Pawan Kalyan

హీరోయిన్ మాధవీలత కెరీర్ ఆరంభంలో మంచి చిత్రాలతో దూసుకుపోయింది. కొన్ని నెలల క్రితం టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి మొట్టమొదట నోరు విప్పిన హీరోయిన్ మాధవి లతే కావడం విశేషం. పలు ఇంటర్వ్యూలలో మాధవీలత టాలీవుడ్ లో తెరవెనుక జరుగుతున్న విషయాలని వెల్లడించింది. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో మాధవీలత ఇటీవల బీజేపీలోచేరింది. కాస్టింగ్ కౌచ్ వలన కెరీర్ ఆరంభంలో ఇబ్బందులని ఎదుర్కొన్నట్లు తెలిపింది. తాజగా జరిగిన ఇంటర్వ్యూలో మాధవి లత పలు విషయాలు వెల్లడించింది.

హీరోయిన్లని వాడుకోవడం

హీరోయిన్లని వాడుకోవడం

కాస్టింగ్ కౌచ్, హీరోయిన్లని వాడుకోవడం అన్ని చిత్ర పరిశ్రమల్లో ఉందని మాధవీలత తెలిపింది. కానీ టాలీవుడ్ లో కాస్త ఎక్కువగా ఉందనేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయని మాధవీలత తెలిపింది. ఆ మధ్యన పెద్ద హీరోల సరసన నటించిన కొందరు హీరోయిన్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. హీరోయిన్లకు వేధింపులు ఎక్కువ కనుకే వారు వెళ్లిపోయారని మాధవి లతా అన్నారు.

రంగస్థలం, మహానటి

రంగస్థలం, మహానటి

టాలీవుడ్ లో మలయాళం తరహాలో హీరోయిన్లకు ప్రాధాన్యత నిచ్చే పాత్రలు ఉండవని మాధవీలత తెలిపింది. ఏడాదికి 150 చిత్రాలు వస్తే అందులో హీరోయిన్లకు మంచి రోల్స్ ఉండేలా రంగస్థలం, మహానటి లాంటి చిత్రాలు ఓ పది వస్తాయి. మిగిలిన 140 చిత్రాల పరిస్థితి ఏంటి.. కాని రంగస్థలం, మహానటి లాంటి చిత్రాలని చూపించి టాలీవుడ్ లో హీరోయిన్లకు మంచి రోల్స్ దక్కుతాయని డబ్బా కొట్టుకుంటారని మాధవీలత వ్యాఖ్యానించింది.

 పెద్ద హీరో సినిమాలో ఛాన్స్

పెద్ద హీరో సినిమాలో ఛాన్స్

కెరీర్ ఆరంభంలో తాను పెద్ద హీరో సరసన ఛాన్స్ మిస్ అయ్యాననిమాధవీలత తెలిపింది. అల్లు అర్జున్ చిత్రంలో సాంగ్ చేసే అవకాశం వచ్చిందని, డేట్స్ కుదరకపోవడం వలన చేయలేదని తెలిపింది. జీవితంలో ఒడిదుడుకులు సహజమే అని తెలిపింది.

 టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్

తాను కాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని మాధవీలత తెలిపింది. నాకు ఎదురైనా చేదు అనుభవాలని వివరించా. ఓ స్థాయి వచ్చాక వీటి గురించి ప్రశ్నిస్తా. క్యాష్ కమిటీ పెడతామని చెప్పారు. ఇంతవరకు లేదు. ఓ స్థాయి వచ్చాక వీటి గురించి ప్రశ్నిస్తా అని తెలిపింది.

శ్రీరెడ్డికి సపోర్ట్ చేయలేదు

శ్రీరెడ్డికి సపోర్ట్ చేయలేదు

తాను శ్రీరెడ్డికి ఎప్పుడూ సపోర్ట్ చేయలేదని మాధవీలత తెలిపింది. నా పోరాటం నాదే అని మాధవీలత తెలిపింది. ఆ సమయంలో సమస్యకు మాత్రం సపోర్ట్ చేశానని మాధవీలత తెలిపింది.

ఆ విధంగా ఎక్కువ సంపాదించా

ఆ విధంగా ఎక్కువ సంపాదించా

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కోసం ఎక్కువగా పరభాషా హీరోయిన్లనే పిలుస్తారనడం సరికాదని అన్నారు. వాస్తవానికి తాను సినిమాలకంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ద్వారానే ఎక్కువ సంపాదించా అని మాధవీలత తెలిపింది.

 ఇష్టమైన హీరోలు

ఇష్టమైన హీరోలు

అందరిలాగే తనకు కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టం అని మాధవీలత తెలిపింది. హీరో శ్రీకాంత్ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం అని మాధవీలత తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్ అనే ప్రత్యేకమైన అభిమానం ఉందని తెలిపింది. అది ఆయన వ్యక్తిత్వం వలెనే అని మాధవీలత తెలిపింది.

లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే

లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే

తాను బీజేపీలో చేరినంత మాత్రాన పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం పోదు అని మాధవీలత తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో లిప్ లాక్ సీన్ చేయవలసి వస్తే ఎవరితో చేస్తారు అని అడిగితే అసలు ఆ సీన్ లో నటించనని చెప్పా. తప్పని సరి పరిస్థితుల్లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ తోనే అని చెప్పా. పవన్ అంటే అంతటి అభిమానం ఉందని తెలిపింది.

బీజేపీలో చేరింది అందుకే

బీజేపీలో చేరింది అందుకే

బిజెపి జాతీయ పార్టీ. ఏదైనా సమస్యని కానీ పోరాటాన్ని కానీ జాతీయస్థాయికి తీసుకుని వెళ్ళవచ్చు. అందుకే ఆ పార్టీలో చేరానని మాధవీలత తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X