చాలా నిజాలు తెలుసు నాకు.. సంచలన వీడియో పోస్ట్ చేసిన మాధవీలత!
Recommended Video

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం అంతులేని కథలా సాగుతూనే ఉంది. శ్రీరెడ్డి మొదలు పెట్టిన పోరాటం అనేక మలుపుతిరిగి ఆమె మెడకే చుట్టుకుంది. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడంలో శ్రీరెడ్డి ఓ పావు మాత్రమే అని దీనివెనుక ఉన్న అసలు కథని పవన్ కళ్యాణ్ తన ట్వీట్స్ ద్వారా స్పష్టం చేసారు. కొన్ని మీడియా సంస్థల వేదికగా పవన్ కళ్యాణ్ పై జరిగిన భారీ కుట్రపై పవన్, ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేని డిబేట్లని ఆయా మీడియా సంస్థలు 8 నెలల పాటు ఎలా నడిపాయో సగటు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆయా మీడియా సంస్థలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తో సహా ఆయన అభిమానులు యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజగా హీరోయిన్ మాధవీలత ఈ విషయం గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కాస్టింగ్ కౌచ్ వ్యతిరేకిస్తూనే
కాస్టింగ్ కౌచ్ గురించి మొదట గళం విప్పిన నటి అంటే మాధవీలత పేరు చెప్పుకోవాలి. ఆ తరువాత శ్రీరెడ్డి సీన్ లోకి వచ్చిన సంచలనం సృష్టించింది. మాధవీలత కాస్టింగ్ కౌచ్ పోరాటానికి మద్దత్తు తెలుపుతూనే పవన్ కళ్యాణ్ ని అభిమానించే వ్యక్తిగా ఆయనకు సపోర్ట్ చేస్తోంది.

నిజాలు బయటకు వస్తాయి
కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ని అలవసరంగా లాగడం, పవన్ కుటుంబ సభ్యులని, తల్లిని దూషించే నీచమైన పనికి రామ్ గోపాల్ వర్మ ఒడి కట్టాడు. మాధవి లత పలు సందర్భాల్లో నిజాలు అన్ని బయటకు వస్తాయని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది.
మరో సంచలన పోస్ట్
తాజాగా మాధవి లతా తన పేస్ బుక్ పేజీ సంచలన పోస్ట్ పెట్టింది. తనకు చాలా నిజాలు తెలుసు అని పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న కుట్రని నర్మగర్భంగా వివరించింది. తనకు నిజాలు ఎలా తెలుసు? ఎవరి ద్వారా తెలుసు అనే విషయాల గురించి మాధవీలత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.

నిజాయితీతో ఉన్న వారు
తనకు నిజాయతీ కలిగిన జర్నలిస్టులు కొంతమంది తెలుసు అని మాధవీలత తెలిపింది. నిజాలని బయటపెట్టే క్రమంలో వారిని తొక్కేస్తున్నా కూడా తట్టుకుని పనిచేస్తున్న జర్నలిస్ట్ స్నేహితులు ఉన్నారని మాధవీలత తన పోస్ట్ లో ప్రస్తావించింది. అలాంటి వారిని చూస్తుంటే తనకు గర్వంగా ఉంటుందని మాధవీలత అన్నారు.

వీడియో గురించి
సినీ క్రిటిక్ గా చెప్పుకునే ఓ వ్యక్తి, శ్రీరెడ్డి మీడియా డిబేట్లకు వెళ్లి ఎంత డబ్బు తీసుకుంటారో ఓ పవన్ కళ్యాణ్ అభిమాని పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. ఆ వీడియో ని మాధవీలత పోస్ట్ చేసింది. ఇతనెవరో చాలా బాగా చెప్పారు. ఆయన చెప్పిన విషయాల్లో నాకు 50 శాతం ముందే తెలుసు అని, ఇతను చాలా డిటైల్డ్ గా చెప్పారని మాధవిలతా అన్నారు.

యుద్ధంలో పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్
కొన్ని మీడియా సంస్థలపై పవన్ కళ్యాణ్ చేస్తున్న యుద్దానికి మాధవీలత పరోక్షంగా మద్దత్తు ఇచ్చినట్లు అయింది. మాధవీలత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


Click it and Unblock the Notifications











